బెడ్‌షీట్ అంతా రక్తం.. ఆనందం మాత్రం అమ్మదే!

Kangana Ranaut: ఇటీవల డేటింగ్ యాప్‌ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ ఒక ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన మొదటి పీరియడ్స్, దాని గురించి ఇంట్లో ఎదుర్కొన్న సమస్యలు, తల్లితో ఉన్న బంధం గురించి చెప్పారు.

మా అమ్మ పీరియడ్స్ గురించి చెప్పలేదు..

కంగనా రనౌత్ ప్రకారం.. పాఠశాలలో 9వ తరగతిలో ఉన్నప్పుడు అమ్మాయిలకు పీరియడ్స్ గురించి చెప్పేవారు. కానీ చాలా మంది అమ్మాయిలకు 8వతరగతిలోనే మొదటి పీరియడ్ వస్తుంది. పాఠశాలలో ఇచ్చే సమాచారం కూడా అంతగా అర్థం కాకుండా ఉండేది. అది చాలా మంది అమ్మాయిలకు అర్థం అయ్యేది కాదు. మా అమ్మ కూడా పీరియడ్స్ గురించి చెప్పలేదు. టీవీలో వచ్చే ప్రకటనల ద్వారానే నాకు కొంత తెలుసు. అప్పట్లో టీవీలో శానిటరీ ప్యాడ్‌ల ప్రకటనలు వచ్చేవి. వాటిని చూసి నాకు విషయం అర్థం అయ్యింది. అయినప్పటికీ పూర్తి వివరాలు తర్వాతే తెలిశాయని కంగనా రనౌత్ చెప్పారు.

Kangana Ranaut s First Period Story Mom Threw Away My Dolls

శానిటరీ ప్యాడ్‌లను పోస్టుమార్టం చేసిన కంగనా అండ్ ఫ్రెండ్స్
కంగనా రనౌత్ మాట్లాడుతూ.. తనకు అల్లరి చేసే స్నేహితులు ఉన్నారని, ఒకసారి ఒక స్నేహితురాలు స్కూల్‌కు ప్యాడ్ తీసుకొచ్చిందని చెప్పారు. అప్పుడు ఆ ప్యాడ్‌లో ఏముంటుందో తెలుసుకోవడానికి దాన్ని ముక్కలు చేసి పోస్టుమార్టం చేసినట్లు కంగనా చెప్పుకొచ్చింది. అందులోని ఒక్కో పొరను కత్తిరించి చూశామని.. ఆ తర్వాత ఆ విషయం ఎవరికీ చెప్పకూడదని ఒకరికొకరు ఒట్టు వేసుకున్నామని వెల్లడించారు. టీవీలో ప్యాడ్ చూసినప్పటి నుంచి మా అందరికీ అది ఒక రహస్యంగా ఉండేదని ఆమె తెలిపారు.

అమ్మ నా బొమ్మలను ఎందుకు బయట పడేసిందో ఇప్పుడు అర్థమైంది..
కంగనా తన తరగతిలోని చాలా మంది అమ్మాయిలకు పీరియడ్స్ వచ్చాయని, కానీ 9వ తరగతి వచ్చినా తనకు ఇంకా రాలేదని చెప్పారు. "ఒకసారి మా అమ్మ నన్ను అడిగింది. నీకు ఇంకా పీరియడ్స్ రాలేదా? అని. నేను లేదు అని చెప్పినప్పుడు.. ఆమె చాలా కంగారు పడింది. ఆ సమయంలో నేను బొమ్మలతో ఆడుకునేదాన్ని. ఒక రోజు అమ్మకు చాలా కోపం వచ్చి, పీరియడ్స్ రావడం లేదు, ఇంకా బొమ్మలతో ఆడుకుంటోందని చెప్పి.. నా బొమ్మలన్నింటినీ బయట పడేసింది. తర్వాత అమ్మ నాకు చెప్పేది, ఒక రోజు నీకు పీరియడ్స్ వస్తాయి, అప్పుడు రక్తం వస్తే నా దగ్గరకు రావాలి." అని కంగనా రనౌత్ వెల్లడించారు.

మొదటి పీరియడ్ చూసి భయపడిన కంగనా
ఒక రోజు ఉదయం నిద్ర లేచి చూసినప్పుడు తన బెడ్ షీట్ మొత్తం రక్తంతో నిండిపోయి ఉందని కంగనా రనౌత్ చెప్పారు. "అది చూసి నేను భయపడి ఏడవడం మొదలుపెట్టాను. కానీ మా అమ్మ మాత్రం చాలా సంతోషపడింది. ఎందుకంటే నాకు చివరికి పీరియడ్స్ వచ్చాయని. నేను మాత్రం ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే నేను పెద్దదాన్ని అయ్యాను. ఇకపై ప్రతి నెల ఇది జరుగుతుంది. ఇదంతా భరించాలి అని భయపడ్డాను. ఎందుకిలా నాకే జరిగిందని బాధపడ్డాను. ఇకపై మా నాన్న నన్ను ప్రేమించరేమో, ఆయన ఒడిలో కూర్చోలేనేమో, మా అమ్మ నన్ను హత్తుకోదేమో అని భయపడ్డాను. మా అమ్మానాన్నలకు దూరం అయిపోతానేమో అనిపించింది. "అని కంగనా రనౌత్ తన భావాలను పంచుకున్నారు. తన సోదరుడు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చనిపోయాడని కూడా కంగనా చెప్పారు. అందుకే వారి కుటుంబంలో అందరి జననం ఇంట్లోనే జరిగిందని తెలిపారు. కంగనా కూడా ఇంట్లోనే పుట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+