పెళ్లి కాకుండానే గర్భవతైన హీరోయిన్.. కారణం ఎవరో చెప్పేసిన బ్యూటీ

సాధారణ ప్రజల జీవితాల్లో ప్రేమ, బ్రేకప్‌లు, ఎఫైర్స్, పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం. కానీ సెలబ్రిటీల విషయానికి వస్తే మాత్రం ఇవన్నీ పెద్ద వార్తలుగా మారిపోతాయి. దీనికి ప్రధాన కారణం వారు పబ్లిక్ ఫిగర్స్ కావడం. సెలబ్రిటీలు నిరంతరం ప్రజల దృష్టిలో ఉంటారు. వారి వ్యక్తిగత జీవితంపై ప్రజలకు సహజంగానే ఆసక్తి ఉంటుంది. వారు ఏమి తింటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎవరిని కలుస్తున్నారు, వారి బంధాలు ఎలా ఉన్నాయి వంటి ప్రతి చిన్న విషయంపై ప్రజలు నిశితంగా గమనిస్తారు. తాజాగా ఓ హీరోయిన్ ఇలాంటి ఆసక్తిని రేకెత్తించింది. పెళ్లి కాకుండానే గర్భవతై అందరికీ షాకిచ్చింది.

కన్నడ ఇండస్ట్రీలో నటి భావనకు మంచి క్రేజ్ ఉంది.పలు సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించారు. అయితే ఆమె తాజాగా తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. ట్విన్స్‌కు వెల్‌కమ్ చెప్పబోతున్నట్లు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను పంచుకుంది. పెళ్లి కాకుండా ఇదంతా ఎలా సాధ్యమైందనే స్టోరీ కూడా షేర్ చేసింది. తన లాంటి స్త్రీలకు స్ఫూర్తి కలుగుతుందనే ఈ కథను పంచుకుంటున్నట్లు చెప్పింది.

Kannada actress Bhavana is pregnant with out marriage

తనకు సపోర్ట్‌గా ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులకు థాంక్స్ చెప్పింది. '20,30 ఏళ్లలో తనకెప్పుడూ ఇలా అనిపించలేదు. 40ఏళ్లలో తల్లిని కావాలని నిర్ణయించుకున్నా. సింగిల్‌ మదర్‌గా నా పిల్లలను పెంచాలనుకున్నా. ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనివ్వబోతున్నా. ఇంతకు ముందు చాలా మంది డాక్టర్లు రిజెక్ట్ చేశారు. కానీ తనకు హెల్ప్ చేసిన రెయిన్ బో హాస్పిటల్స్ డాక్టర్‌ సుష్మకు ధన్యవాదాలు. నా స్టోరీ ఒక్కరిని ఇన్‌స్పైర్ చేసినా నాకు హ్యాపీ. త్వరలో రెండు సోల్స్ నన్ను అమ్మ అని పిలవబోతున్నాయి' అంటూ బిగ్ నోట్ పంచుకుంది. ఈ స్టోరీ అర్థమైన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతుంటే.. అర్థం కాని వారు మాత్రం ప్రెగ్నెంట్ ఎలా అయిందని ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+