మగాళ్లను వీధి కుక్కలతో పోల్చిన స్టార్ హీరోయిన్.. జైల్లో వేయాలంటూ !!
కన్నడ చిత్రసీమలో 'గోల్డెన్ గర్ల్', 'శాండల్‌వుడ్ క్వీన్'గా పేరు తెచ్చుకుంది నటి "దివ్య స్పందన". సినిమాల్లో రమ్యగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా మెప్పించింది. 2003లో పునీత్ రాజ్‌కుమార్ సరసన 'అభి' అనే కన్నడ చిత్రంతో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే పెద్ద విజయాన్ని అందుకున్న ఆమె.. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. కన్నడలో ఆకాష్, అమృతధారే, జొతే జొతైయలి, ముసంజెమాటు, సంజు వెడ్స్ గీత వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది. అలానే తమిళంలో సూర్య సరసన నటించిన 'వారణం ఆయిరం' (తెలుగులో సూర్య s/o కృష్ణన్), ధనుష్ సరసన 'పొల్లాదవన్' చిత్రాలు మంచి క్రేజ్ తెచ్చాయి.
ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "అభిమన్యు" సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ని కూడా పలకరించింది. తన నటనకు గానూ రెండుసార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును.. ఒకసారి కర్ణాటక రాష్ట్ర సినీ అవార్డును గెలుచుకున్నారు. కాగా 2016 తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్నప్పుడే ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె.. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకూ దూరంగా ఉంటున్నారు. అయితే పాలిటిక్స్ కి దూరమైనప్పటికీ నుంచి.. సామాజిక అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా మూగజీవుల హక్కుల విషయంలో ప్రత్యేకంగా వీధి కుక్కల సమస్యలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మగాళ్లను వీధి కుక్కలతో పోల్చుతూ పెట్టిన స్టోరీ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వీధి కుక్కలు ఎప్పుడు కరుస్తాయో ఊహించలేమని.. వాటి మానసిక స్థితిని అర్థం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేగాక అవి కరిచినా, కరవకున్నా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని పేర్కొంది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్ హోమ్‌లకు తరలించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ రకంగా వెల్లడించింది.
నటి షాకింగ్ పోస్ట్..
ఇప్పుడు లేటస్ట్ గా సుప్రీం చేసిన వ్యాఖ్యలపై నటి రమ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ పోస్టులో.. మగాళ్లను కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టం. వారు ఎప్పుడు అత్యాచారం చేస్తారో, ఎప్పుడు హత్య చేస్తారో తెలియదు. అలాంటప్పుడు మగాళ్లు అందరినీ జైలులో పెట్టేయాలా? రాసుకొచ్చారు. దీంతో రమ్యపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమదైన శైలిలో రియాక్ట్ అవుతూ ఉండగా.. పలువురు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు ఫైర్ అవుతున్నారు.

-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications