కాంతార మూవీ టీమ్‌కు రోడ్డు ప్ర‌మాదం.. ప‌లువురికి గాయాలు..

కన్నడ హీరో రిషభ్​ శెట్టి నటించిన 'కాంతార' సినిమా మూవీ టీమ్‌కు రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ప‌లువురు ఆర్టిస్టులు గాయాప‌డిన‌ట్లు తెలుస్తోంది. కాంతార చాప్టర్ 1' సినిమాలోని న‌టిస్తున్న కొంద‌రు నటీనటులను తీసుకు వెళుతున్న ఒక మినీ బస్సు బోల్తా పడింది. ఈ మినీ బ‌స్సులో సుమారు 20 మంది ఆర్టిస్టులు ఉన్న‌ట్లు స‌మాచారం. రిష‌బ్ శెట్టి స్వియ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన కాంతార చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని అందుకుందో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల నుంచి వ‌చ్చిన స్పంద‌న తో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను కూడా రాబ‌ట్టింది. అయితే ఇప్పుడీ కాంతార సినిమాకు సీక్వెల్‌ రాబోతోంది. ప్రస్తుతం ఈ సీక్వెల్ షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా కాంతార చాప్టర్ 1కు చెందిన ఆర్టిస్టులను తీసుకెళ్తున్న ఓ మినీ బ‌స్సు బోల్తా ప‌డింది. పోలీసులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు కర్ణాటకలోని జడకల్‌లోని ముదుర్‌లో షూటింగ్‌ ముగించుకుని కొల్లూరుకు తిరిగి వస్తుండగా ఈ ప్ర‌మాదం సంబ‌వించింది. ఈ మినీ బస్సులో సుమారు 20 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్​ను పూర్తి చేసుకుంది. అయితే ఈ టీమ్ మొత్తం ముదూరులో డ్యాన్స్​ షూట్​ కంప్లీట్ చేసుకుని కొల్లూరుకు తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్రమాదం జరిగిన‌ట్లు తెలుస్తోంది. ఎదురుగా వచ్చిన బైకును త‌ప్పించే క్ర‌మంలో మినీ బ‌స్సు అదుపుత‌ప్పి బోల్తా పడినట్లు తెలిసింది. బ‌స్సులో ఉన్న‌వారంద‌రికీ స్వల్ప గాయాలయిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరంద‌రినీ జడ్కల్​ మహాలక్ష్మీ క్లినిక్​లో ప్ర‌థ‌మ చికిత్స చేసిన‌ట్లు స‌మాచారం. అయితే, ఈ ప్రమాదంలో ఆరుగురు జూనియర్ ఆర్టిస్టులకు తీవ్ర గాయాల‌యిన‌ట్లు తెలుస్తోంది. వారిని మెరుగైన వైద్యం కోసం కుందాపుర్​ హాస్పిటల్​కు తరలించిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు.

Kantara movie team meets with road accident Many injured

కాంతార‌కు ప్రీక్వెల్‌..

న‌టుడు రిషబ్ శెట్టి ఇటీవలే 'కాంతార: చాప్టర్ 1' విడుదల తేదీని ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2025న విడుదల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు. రిషబ్ శెట్టి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నటించిన 'కాంతార' 2022 సంవత్సరంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా అనంత‌రం రిషబ్ దాని సీక్వెల్‌ను ప్రకటించాడు. అయితే, ఈ సినిమా కాంతార సినిమాకంటే ముందు కథ కావడంతో ఇది ప్రీక్వెల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+