Karthika deepam 2 December 10th:దీపపై జ్యోత్స్న వ్యక్తిగత దాడి..!!
'కార్తీకదీపం 2' సీరియల్‌లో నేటి ఎపిసోడ్ (537వ ఎపిసోడ్) నవ్వులు, కోపాలు, సంచలన ఆరోపణలతో ఉత్కంఠగా సాగింది. ఒకవైపు పారిజాతం పనిమనిషిగా మారి కార్తీక్ దెబ్బకు చుక్కలు చూడగా, మరోవైపు దీప గొప్ప ఐడియాతో అందరి ప్రశంసలు అందుకుంది. అయితే, చివర్లో జ్యోత్స్న దీప వ్యక్తిగత జీవితంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇంట్లో పెద్ద కలకలానికి దారితీశాయి.
పారిజాతంకు వన్ డే సీఎం శిక్ష: షాక్‌లో శ్రీధర్
గత ఎపిసోడ్‌లో శౌర్య అమాయకపు మాటలతో పారిజాతం కుట్ర బట్టబయలవడంతో, దీపకు బదులుగా పారిజాతం ఇంటి పనులు చేయాలని శివన్నారాయణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. నేటి ఎపిసోడ్‌లో శ్రీధర్ ఇంటికి రావడంతో, దీపకి బదులుగా పారిజాతం కాఫీ తీసుకురావడం చూసి శ్రీధర్ షాక్ అవుతాడు. "వన్ డే సీఎంలా దీప ప్లేస్‌లోకి పారు వచ్చిందని" కార్తీక్ సరదాగా చెప్పడంతో, పారిజాతం తన బాధను వ్యక్తం చేస్తుంది.ఈ సమయంలో శ్రీధర్, కాశీని తన పీఏ (పర్సనల్ అసిస్టెంట్)గా నియమించినట్టు ప్రకటించడంతో జ్యోత్స్న మండిపడుతుంది. "ఎవరిని అడిగి అపాయింట్ చేశారు?" అని ప్రశ్నించగా, సీఈవోకు ఆ హక్కు ఉందని కార్తీక్ కౌంటర్ ఇస్తాడు. అయితే, "నిన్న శ్రీధర్ నాకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడని" శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న ముఖం మాడిపోతుంది.

దీప ఐడియాకు చప్పట్లు:జ్యోత్స్న ప్లాన్ ఫెయిల్
తరువాత శ్రీధర్, జ్యోత్స్న రెస్టారెంట్ అభివృద్ధికి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇచ్చాడు. ఫుడ్ ట్రక్కుల కాన్సెప్ట్‌ను జ్యోత్స్న వ్యతిరేకిస్తూ, "అన్నింటినీ దాటుకుని మన దగ్గర ఎవరు కొంటారు?" అని ప్రశ్నించింది.అయితే, దీప ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చింది. "ఫుడ్ వేస్ట్ కాకుండా అనాథ పిల్లలకు పంచిపెడితే పుణ్యం వస్తుంది, పేరు కూడా వస్తుంది. పేదల ఆకలి తీర్చడం కోసం ఈ రెస్టారెంట్ నిలబడుతుందని జనం అనుకుంటారు," అని చెప్పింది. ఈ ఐడియాకు శివన్నారాయణ, దశరథలతో పాటు అందరూ చప్పట్లు కొట్టారు. "ఆకలి గురించి, అనాథల గురించి బాగా చెప్పావు... ఇలాంటి లక్షణాలు రక్తంలో ఉండాలి," అని శివన్నారాయణ దీపను ఆశీర్వదించగా, జ్యోత్స్న, పారిజాతం అసూయతో ఉడుక్కున్నారు.
వ్యక్తిగత జీవితంపై జ్యోత్స్న దాడి: సుమిత్ర ఆగ్రహం
కార్తీక్, దీప కోసం గులాబ్ జాంలు తయారు చేయించి, దీప చెప్పిన ఐడియాను ప్రశంసిస్తూ, ఆమె భార్యగా తనకు గర్వకారణమని చెప్పాడు.అయితే, ఈ ఆనందాన్ని చెడగొట్టాలని జ్యోత్స్న దురుద్దేశంతో మాట్లాడుతూ, "దీప మొదటి భర్తని దురదృష్టవంతుడిని చేసి జైలు పాలు చేసిందని," సంచలన ఆరోపణ చేసింది. "నచ్చినవాడు కంటికి కనిపించినప్పుడు, నచ్చనివాడిని దూరం పెట్టడమే మంచిదని," అంటూ కార్తీక్, దీపల పెళ్లి బంధంపై అనుమానాలు సృష్టించడానికి ప్రయత్నించింది.
ఈ మాటలకు ఆగ్రహించిన దశరథ, "మరొక ఆడదాని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నానన్న సంస్కారం లేకుండా పోయిందని" జ్యోత్స్నకి చీవాట్లు పెట్టాడు. జ్యోత్స్న మాటలు సహించలేని సుమిత్ర కోపంతో ఆమెను కొట్టబోగా, కార్తీక్ అడ్డుకోవడంతో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగిసింది.












Click it and Unblock the Notifications