Karthika deepam 2 October 8th Episode:కార్తీక్ టార్గెట్ ఫిక్స్..ఆ రహస్యం లీక్..!!

వేలం పాటలో 11 కోట్ల భారీ నష్టం రాకుండా కార్తీక్ కాపాడినా, అగ్రిమెంట్‌ను రద్దు చేసుకోకుండా ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. శివన్నారాయణ ఎన్నిసార్లు ఇంటి నుంచి వెళ్లిపోమన్నా, "పెద్ద మేడం (సుమిత్ర) చెబితేనే వెళ్తా" అని కార్తీక్ తేల్చి చెప్పాడు. చివరకు సుమిత్ర నేరుగా అడగ్గా, "ఇదంతా మీ కూతురి కోసమే చేస్తున్నాను" అని చెప్పడంతో జ్యోత్స్న, పారు షాక్ అయ్యారు. కార్తీక్ మాటల వెనుక నిజం తెలుసుకోవడానికి ఇంటి సభ్యులంతా తంటాలు పడటం హైలైట్‌గా నిలిచింది.

నేటి ఎపిసోడ్ (అక్టోబర్ 8)లో సంచలన నిజాలు..
నేటి 483వ ఎపిసోడ్‌లో జ్యోత్స్న గుట్టురట్టు కావడం మొదలైంది. కార్తీక్ చర్యలకు అసలు కారణం దీప కాదని, సుమిత్ర కూతురి కోసమే అని చెప్పడంతో కాంచన మండిపడుతుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిన వదిన (సుమిత్ర) తన కూతుర్ని ఎందుకు మార్చుకోలేక పోయిందని అనసూయను ప్రశ్నిస్తుంది.

karthika-deepam-2-serial-october-8st-episode-483-here-is-the-todays-full-story

మరోవైపు, తన ఉద్దేశం జ్యోత్స్న నోటితోనే నిజం చెప్పించడమే అని కార్తీక్ దీపకు క్లారిటీ ఇస్తాడు. ఈలోగా, ఉదయాన్నే దీప, పారు, జ్యోత్స్నల మధ్య మాటల యుద్ధం జరిగింది. కార్తీక్ డ్రైవర్‌గా ఉండటానికి కారణం "జ్యోత్స్న కోసమే కాదు, అమ్మాయిగారి వల్ల" అని దీప పదే పదే చెప్పడంతో, జ్యోత్స్న ఇదంతా తనపైకి నెట్టే కుట్ర అని ఆందోళన పడింది.

తండ్రి దగ్గరికి జ్యోత్స్న... రహస్యం లీక్
దీంతో భయపడిన జ్యోత్స్న, తన సొంత తండ్రిని కలవడానికి వెళ్తుంది. అక్కడ ఆమె తండ్రి.. "నీ పుట్టుక రహస్యం దీపకు చెప్పావా?" అని అడుగుతాడు. "నీ కూతురంటే నీకు ఇష్టం లేదా? నా జీవితం, గ్రానీ నిర్ణయం! ఇదంతా చేసింది నీకోసమే" అని జ్యోత్స్న వాదిస్తుంది. ఆ తండ్రి 'బిడ్డల్ని మార్చిన విషయం నీ అమ్మకు తెలుసు, వారసురాలు బతికే ఉందని నేనే చెప్పా' అని చెబుతాడు. ఆ రోజు రాత్రి ఇంకెవరైనా చూసి ఉంటారేమో లేదా మా అమ్మ చంపించిన సైదులు బతికే ఉన్నాడేమో అని తండ్రి అనుమానం వ్యక్తం చేయడంతో జ్యోత్స్న భయం రెట్టింపు అవుతుంది.

ఇదిలా ఉండగా, భార్యాభర్తలు మాట్లాడుకోవాలని దీప పట్టుబట్టగా.. "నా నమ్మకం పగిలిపోయింది. దాన్ని నువ్వు అతికించగలవా?" అంటూ దశరథ్ కాఫీ కప్పుని పగులగొట్టి తన బాధను సుమిత్రకు తెలియజేస్తాడు.

జ్యోత్స్న కన్నతండ్రి చేసిన ఈ సంచలన నిజం లీక్‌తో, కార్తీక్ టార్గెట్ నెరవేరినట్లేనా? బిడ్డను మార్చిన రహస్యం ఎవరి ద్వారా బయటికి రానుంది? అనేది తదుపరి ఎపిసోడ్ ప్రేక్షకులకు మరింత ఉత్కంఠను పెంచనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+