Karthika deepam 2 September 25 Episode:కార్తీక్ కోపం,ఇరు కుటుంబాల్లో ముదిరిన విబేధాలు..!!
కార్తీక దీపం సీరియల్ ట్విస్టులతో కొనసాగుతోంది. నిన్నటి ఎపిసోడ్‌లో, దీప తన తప్పును ఒప్పుకోవడంతో రెండు కుటుంబాలు కలిసిపోతాయని ఆశించిన శ్రీధర్, కార్తీక్ అందుకు అడ్డుపడటంతో తీవ్రంగా నిరాశపడతాడు. శ్రీధర్ మాటలకు కార్తీక్ ఆగ్రహించి, "చేయని తప్పును ఒప్పుకోవడం కూడా తప్పే" అని గట్టిగా బదులిస్తాడు. సుమిత్ర కూడా దీప క్షమాపణ చెప్పేదాకా క్షమించనని భీష్మించుకోవడంతో, కార్తీక్ కుటుంబంతో పాటు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. ఈ నాటకీయ పరిణామాల తర్వాత, సెప్టెంబర్ 25న ప్రసారమైన 472వ ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది.
తాజా ఎపిసోడ్ (సెప్టెంబర్ 25)లో..
దీప వల్ల రెండు కుటుంబాలు కలిసే అవకాశం పోయిందని శ్రీధర్ అనగా, కార్తీక్ మరింత ఆగ్రహానికి గురవుతాడు. "ఇది నా కుటుంబం, నా సమస్య. ఇందులో మీరు తలదూర్చాల్సిన అవసరం లేదు. మా అత్త పిలిస్తే వచ్చారు, అది అక్కడే ముగిసిపోయింది. వెంటనే బయలుదేరండి" అంటూ తండ్రిని గట్టిగా హెచ్చరించి ఇంటి నుంచి బయటికి పంపుతాడు.

మరోవైపు సుమిత్ర తీరుపై దశరథ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. "దీపను అంతగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది?" అని ప్రశ్నిస్తాడు. దానికి జ్యోత్స్న మద్దతుగా మాట్లాడుతూ, "దీప తన తప్పు ఒప్పుకుంటే బాగుండేది" అని అంటుంది. అది విన్న దశరథ మరింతగా మండిపడి, "ఆ తప్పు ఒప్పుకోడానికి ముందు నీ తప్పులు నువ్వు ఒప్పుకోవచ్చు కదా?" అని జ్యోత్స్నను నిలదీస్తాడు.
దశరథ సూటిగా వేసిన ప్రశ్నలకు జ్యోత్స్న వణికిపోతుంది. "దీప చేతిలోకి గన్ ఎలా వచ్చింది? నువ్వు గన్ ఎందుకు తెచ్చావు? దీప నిన్ను చంపబోతుందని నీకు ఎలా తెలిసింది?" అని దశరథ వరుస ప్రశ్నలు వేయడంతో జ్యోత్స్న దగ్గర సమాధానాలు ఉండవు. దీంతో తప్పును పక్కదారి పట్టించడానికి "కన్న కూతురి కంటే మీకు వాళ్లే ఎక్కువ" అంటూ దశరథతో గొడవకు దిగుతుంది. ఆ మాటలకు ఆగ్రహించిన సుమిత్ర, "నీ హద్దుల్లో నువ్వుండు, మీ నాన్న గురించి మరో మాట మాట్లాడితే సహించేది లేదు" అంటూ జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. ఈ పరిణామాలతో తర్వాతి ఎపిసోడ్‌పై ఉత్కంఠ పెరిగింది.












Click it and Unblock the Notifications