మొన్న బికినీతో..నేడు బేబీ బంప్‌తో..ఏదైనా నీకే సాధ్యం తల్లి
బాలీవుడ్‌లో ఇప్పటికిప్పుడు స్టార్ హీరోయిన్ ఎవరంటే అందరు ఠక్కన చెప్పే పేరు కియారా అద్వానీ. వరుస సినిమాల్లో నటిస్తూ అక్కడ స్టార్ హీరోయిన్‌గా కియారా అద్వానీ మారిపోయింది. ఇదే సమయంలో తెలుగులో కూడా మహేష్ బాబు, రామ్ చరణ్ హీరోల వంటి సినిమాల్లో నటించి సౌత్‌లో కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. మహేష్ బాబుతో భరత్ అనే నేను, రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ,గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించింది.
బాలీవుడ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాను కియారా గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. హీరో సిద్దార్ధ్ మల్హోత్రాతో కొన్నాళ్లు డేటింగ్ చేసిన కియారా , తర్వాత తమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లింది. 2023లో ఈ జంట వివాహం చేసుకున్నారు.కియారా ప్రస్తుతం వార్-2 సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు.

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌లో హీరోలిద్దర్ని కియారా ఫుల్‌గా డామినేట్ చేసింది. టీజర్ కేవలం రెండు నుంచి మూడు సెకన్లు మాత్రమే కనిపించింది. బికినీతో యావత్తు మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది ఈ హాట్ బ్యూటీ. కియారా బికినీ షోకి సోషల్ మీడియా అల్లాడిపోయింది.కియారా బికినీ ప్రభావం వారం రోజులపాటు కనిపించింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది. తాను తల్లి కాబోతున్నానని ఈ బ్యూటీ ప్రకటించింది.
కియారా గర్భవతి కావడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గర్భవతికి ముందే వార్-2 సినిమా షూటింగ్‌ను పూర్తి చేసింది కియారా. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తోంది అమ్మడు. తాజాగా బేబీ బంప్‌తో కనిపించి షాకిచ్చింది. కియారా అద్వానీ తన "బేబీ బంప్"తో మెట్ గాలా 2025 ఈవెంట్‌లో కనిపించారు. కియారా అద్వానీ బేబీ బంప్ పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. బికినీతో కనిపించినా, బేబీ బంప్‌తో కనిపించినా మేము నీకు బానిసలమే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం కియారా అద్వానీ బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications