Viral Video: వికెట్ తీసి 'Gen-Z' సెలబ్రేషన్స్.. రాత్రికి రాత్రే స్టార్!
Viral Video: క్రికెట్ స్డేడియంలో ప్లేయర్లు తమ ఆటతీరుతోనే కాకుండా వారి ప్రత్యేక స్టైల్‌తో కూడా వార్తల్లో నిలుస్తారు. గురువారం(ఆగస్టు 20) నాడు సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ జట్ల మధ్య మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026 మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వికెట్ తీసిన అనంతరం సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ ఆల్‌రౌండర్ మేధావి బిధురి చేసిన 'Gen-Z' స్టైల్ సెలబ్రేషన్స్ నెట్టింట రాత్రికి రాత్రే వైరల్ అయ్యాయి. ఆమె ధరించిన జెర్సీ నంబర్ 67 కూడా ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఎవరీ మేధావి బిధురి?
మేధావి బిధురి మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ తరఫున ఆల్-రౌండర్‌గా ఆడుతోంది.. ఆమె రైట్ హ్యాండ్ బ్యాటింగ్ చేయడంతో పాటు లెగ్-బ్రేక్ బౌలింగ్ చేస్తుంది. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో మేధావి బిధురి 4 ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్ లో కేవలం 5 పరుగులే చేసినప్పటికీ.. ఆమె చేసిన వికెట్ సెలబ్రేషన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

సోదరి ఐడియాతో హంగామా
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ ప్రకారం, మేధావి బిధురి సంబరం చేసుకోవాలనే ఆలోచన ఆమె సోదరిది. 'జెన్-జెడ్' ట్రెండ్స్ పై ఆసక్తి ఉన్న ఆమె సోదరి.. మేధావి బిధురి 67వ నంబర్ జెర్సీ ధరించి వికెట్ తీసిన తర్వాత ప్రత్యేకంగా సంబరం చేసుకోవాలని సూచించింది.ఆ తర్వాత మేధావి బిధురి అదే స్టైల్లో మైదానంలో సంబరాలు చేసుకోగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయింది. అభిమానులు ఆమె క్రికెట్ ప్రతిభతో పాటు ఆమె అందమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన స్టైల్‌ను కూడా ప్రశంసిస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్ జట్టు మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ, మేధావి బిధురి చేసిన జెన్-జెడ్ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయింది.
Meet Medhavi Bidhuri
— Kiara (@Kiara_X_X1) August 21, 2026
Genz cricketer 🏏 Jersey no. 67
>She went famous for her trending celebration 💃
>She comes as a package > She is cute
>She is cricketer
>She wears yellow jersey 🟡 pic.twitter.com/kBGZItEdj9
'6-7' జెన్-జెడ్ ట్రెండ్ అంటే ఏమిటి?
"6-7" అనేది ఈ రోజుల్లో జెన్-జెడ్, సోషల్ మీడియా వాడుకలో వైరల్ అయిన ఒక మీమ్/ఇంటర్నెట్ స్లాంగ్. దీనికి ఎలాంటి లోతైన అర్థం లేనప్పటికీ.. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో దీనిని సరదాగా చెప్పడానికి లేదా రాయడానికి, ముఖ్యంగా "సిక్స్-సెవెన్" అంటూ చేతి వేళ్లతో ప్రత్యేకమైన సైగలు చేయడం ఓ ట్రెండ్‌గా మారింది. మేధావి బిధురి జెర్సీ నంబర్ 67 కావడం, దానికి తోడు అదే ట్రెండ్‌ను స్టేడియంలో రీక్రియేట్ చేయడంతో ఆమె అందమైన స్టైల్ కు, ఆత్మవిశ్వాసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.













Click it and Unblock the Notifications