Airtel: క్లౌడ్ కంప్యూటింగ్‌లో సంచలనం, 'సావరిన్ క్లౌడ్'తో మన డేటా ఇక మన దేశంలోనే..

మనం ఫోన్‌లో ఒక యూపీఐ పేమెంట్ చేసినా, ఏదైనా ముఖ్యమైన అపాయింట్‌మెంట్ తీసుకున్నా, చివరికి ఒక ఫొటో దిగినా సరే... అవన్నీ డిజిటల్ డేటాగా మారతాయి. మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్ ద్వారా నేడు దేశంలో ప్రతిరోజూ కోట్లాది జీబీల డేటా ఉత్పత్తి అవుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి బ్యాంకింగ్ సేవలు, రక్షణ రంగ సమాచారం వరకు అన్నీ డిజిటల్ రూపంలోనే భద్రమవుతున్నాయి. అయితే, ఈ డేటా ఎక్కడ స్టోర్ అవుతోంది? దీన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? వేరే దేశాల చేతుల్లోకి మన సమాచారం వెళ్తే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే 'సావరిన్ క్లౌడ్' (Sovereign Cloud).

భారత డిజిటల్ భద్రతను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లడంలో 'ఎయిర్‌టెల్ క్లౌడ్' కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలోనే తొలిసారిగా టెలికాం ఆధారిత 'సావరిన్ క్లౌడ్' రంగాన్ని ఎయిర్‌టెల్ అందుబాటులోకి తెచ్చింది. నిమిషానికి 1.4 బిలియన్ల ట్రాన్సాక్షన్లను తట్టుకోగల అత్యంత శక్తివంతమైన నెట్‌వర్క్‌పై దీనిని రూపొందించారు. డేటా సెంటర్లు, మౌలిక వసతులు, కంట్రోల్ సిస్టమ్స్ అన్నీ నూటికి నూరు శాతం భారత్‌లోనే ఉంటూ, 99.99 శాతం నెట్‌వర్క్ అప్‌టైమ్‌తో ఇది పనిచేస్తుంది.

What Is Sovereign Cloud How Airtel Cloud Is Securing India s Digital Future and Private Data

కేంద్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) గుర్తింపు పొందిన ఈ స్వదేశీ క్లౌడ్ ప్లాట్‌ఫామ్, భారతీయ కంపెనీలకు, ప్రభుత్వ సంస్థలకు సురక్షితమైన, నమ్మకమైన డిజిటల్ సేవలను అందిస్తూ 'మేక్ ఇన్ ఇండియా' డిజిటల్ కలలకు కొత్త ఊపిరి పోస్తోంది.

అసలు ఏమిటీ డిజిటల్ క్లౌడ్?

సాధారణంగా డిజిటల్ సమాచారాన్ని దాచడానికి, ప్రాసెస్ చేయడానికి పెద్ద పెద్ద సర్వర్లు అవసరం. గతంలో సంస్థలు సొంతంగా సర్వర్లను నిర్వహించేవి. కానీ ఇప్పుడు అధునాతన 'క్లౌడ్' విధానం అందుబాటులోకి వచ్చింది. క్లౌడ్ అంటే ఒక పెద్ద "డిజిటల్ లాకర్" లేదా "డిజిటల్ గోడౌన్" లాంటిది. అక్కడ మన సమాచారం భద్రంగా ఉండటమే కాకుండా, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సులువుగా యాక్సెస్ చేయవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు, ఆస్పత్రులు, పెద్ద కంపెనీలు తమ వ్యాపారాల కోసం ఈ క్లౌడ్ సేవలపైనే పూర్తిగా ఆధారపడుతున్నాయి.

ఉన్నపళంగా ఎయిర్‌టెల్ లో సునీల్ భారతీ మిట్టల్ రీప్లేస్మెంట్.. !!
ఉన్నపళంగా ఎయిర్‌టెల్ లో సునీల్ భారతీ మిట్టల్ రీప్లేస్మెంట్.. !!

డేటా రక్షణ అంత ము ముఖ్యమా?

డిజిటల్ విప్లవం పెరిగే కొద్దీ సైబర్ నేరాలు, హ్యాకింగ్, సైబర్ దాడుల ముప్పు కూడా వేగంగా పెరుగుతోంది. మన వ్యక్తిగత, ఆర్థిక వివరాలు వేరే వారి చేతికి చిక్కితే ఆర్థిక మోసాలు జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఫేక్ కాల్స్, స్పామ్ మెసేజ్‌లు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి.

ఉదాహరణకు, ఎయిర్‌టెల్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో దాదాపు 93 బిలియన్ల స్పామ్ కాల్స్, 4 బిలియన్ల ఫేక్ మెసేజ్‌లను గుర్తించి, 14 లక్షలకు పైగా ఫ్రాడ్ లింకులను బ్లాక్ చేసింది కేంద్రం. డిజిటల్ ప్రపంచంలో భద్రత ఎంత అవసరమో చెప్పడానికి ఇదో ఉదాహరణ.

Airtel: ఇకపై కొత్తగా రీఛార్జ్ చేసే వారికి మాత్రమే
Airtel: ఇకపై కొత్తగా రీఛార్జ్ చేసే వారికి మాత్రమే

'సావరిన్ క్లౌడ్' ఎందుకు అత్యవసరం?

మనం మన బంగారం, విలువైన కాగితాలను వేరే దేశం బ్యాంకుల్లో కాకుండా, మన దేశంలో ఉన్న బ్యాంక్ లాకర్లలో దాచుకుంటే ఎంత భద్రత ఉంటుందో... మన దేశ పౌరుల, ప్రభుత్వాల డేటాను భారత్‌లోనే ఉంచడమే 'సావరిన్ క్లౌడ్' ముఖ్య ఉద్దేశం. భారతీయ చట్టాలు, రక్షణ నిబంధనలకు లోబడి మాత్రమే ఈ క్లౌడ్ పనిచేస్తుంది. దీనివల్ల మన డేటాపై విదేశీ ప్రభుత్వాలు లేదా విదేశీ కంపెనీల ఆధిపత్యం చెల్లదు. డేటా స్టోరేజ్ మాత్రమే కాకుండా, దానికి సంబంధించిన ఎన్‌క్రిప్షన్ కీలు, బ్యాకప్‌లు, యాక్సెస్ అనుమతులు అన్నీ పూర్తి స్థాయిలో మన దేశం పరిధిలోనే ఉంటాయి.

మన దేశంలో డేటా ఉంటే ప్రయోజనాలేంటి?

బ్యాంకింగ్, రక్షణ, పన్నులు, ఆస్పత్రుల సమాచారం అత్యంత సున్నితమైనవి. ఈ సమాచారాన్ని భారత్‌లోనే భద్రపరచడం వల్ల విదేశీ చట్టాల జోక్యం తప్పుతుంది. అత్యవసర సమయాల్లో మన డేటాను వేగంగా, సురక్షితంగా ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. సైబర్ దాడుల నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+