ఇంద్రకీలాద్రి భక్తులకు గుడ్ న్యూస్- దశాబ్ద కాలం తరువాత మళ్లీ..!!
ఇంద్రీకీలాద్రి భక్తులకు తీపి కబురు. దుర్గమ్మను దర్శించుకునే భక్తుల కోసం ఆలయ ప్రాంగణం లో కొత్త సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రానున్న దసరా పండగ లోపు భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఇంద్రకీలాద్రి కొండ దిగువన రూ.52 కోట్లతో నిర్మించిన అన్నదాన నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. ఒకేసారి 800 మంది కూర్చొని భోజనం చేసేలా ఈ భవనాలు నిర్మించామని తెలిపారు.
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇంద్రకీలాద్రిపై మరిన్ని అభివృద్ధి పనులు చేసేందు కు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. ప్రస్తుతం ప్రారంభించిన భవనంలో మెకనైజ్డ్ కిచెన్‌కు కొత్త టెక్నాలజీ వినియోగిస్తున్నామని మంత్రి ఆనం వివరించారు. ఏడాదికి 3 కోట్ల మందికి ఏపీ దేవాలయల్లో అన్నదానం జరుగుతోందని పేర్కొన్నారు.

ఇంద్రకీలాద్రికి రెండో ఘాట్ రోడ్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన నివేదిక సిద్ధమవుతుందని అన్నారు. త్వరలో టెండర్స్ పిలుస్తామని చెప్పారు. కాగా, ఏడాదికి 3 కోట్ల మందికి ఏపీ దేవాలయల్లో అన్నదానం జరుగుతోందని పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రికి రెండో ఘాట్ రోడ్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన నివేదిక సిద్ధమవుతుందని అన్నారు. త్వరలో టెండర్స్ పిలుస్తామని చెప్పారు.
ఇంద్రకీలాద్రి భక్తుల కోసం రూ.26 కోట్ల వ్యయంతో 5,400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మించారు. మొదటి అంతస్తులోని విశాల భోజనశాలలో ఒకేసారి 800 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించేలా సదుపాయాలు కల్పించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కేంద్ర నిల్వ గదులు, నిత్య అన్నదాన సామగ్రి నిల్వ, వంటకు ముందస్తు ఏర్పాట్ల విభాగం, క్యూ మార్గాలు, ఏర్పాటు చేశారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గాలను ప్రత్యేకంగా రూపొందించారు. భోజన ప్రాంగణంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చారు.
కాగా, రూ.26.50 కోట్లతో 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో శ్రీ దుర్గా భవాని మహాప్రసాద భవనాన్ని నిర్మించారు. గ్రౌండ్, మొదటి అంతస్తుల్లో ప్రసాద విక్రయ కౌంటర్లు, పంపిణీ కేంద్రాలు, భక్తుల క్యూ మార్గాలు ఏర్పాటు చేశారు. రెండో, మూడో అంతస్తుల్లో లడ్డూ, పులిహోర, చక్కెరపొంగలి తదితర మహాప్రసాదాల తయారీ, ప్యాకింగ్, నిల్వ, నిర్వహణకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రసాదాల తయారీ, పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించనున్నారు.














Click it and Unblock the Notifications