'కిష్కింధపురి' హారర్ థ్రిల్లర్ కాదు..అంతకు మించి !
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం 'కిష్కింధపురి', ప్రేక్షకుల అంచనాలను మించిపోయింది. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ఈ సినిమాతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని AAA మల్టీప్లెక్స్‌లో జరిగిన ప్రీమియర్ షోకి అద్భుతమైన స్పందన లభించింది.
సినిమా తొలి పది నిమిషాలు కథలోకి వెళ్లడానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ, సువర్ణ మాయలోకి అడుగుపెట్టిన తర్వాత కథనం వేగం పుంజుకుంటుంది. అక్కడి నుంచి ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతూ భయపెట్టింది. ఫస్టాఫ్‌ను దర్శకుడు ఎటువంటి అనవసర హంగులు లేకుండా పాయింట్‌తోనే నడిపించాడు. సెకండాఫ్‌లో కూడా అదే గ్రిప్పింగ్‌ను కొనసాగిస్తూ, హారర్ ఎలిమెంట్స్‌ని ఏమాత్రం తగ్గించకుండా అదరగొట్టాడు.

నటీనటుల విషయానికొస్తే, బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఈ హారర్ జానర్ బాగా సరిపోయింది. తన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. ఇక, అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్‌లో పర్ఫార్మెన్స్ అద్భుతమని ప్రేక్షకులు ప్రశంసించారు. తమిళ నటుడు శాండ నటన గూస్ బమ్స్ తెప్పించింది.
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సౌండ్ డిజైన్. ఎం.ఆర్. రాజా కృష్ణన్ అందించిన సౌండింగ్, హారర్ సినిమాకు ఎంత అవసరమో అంతే అద్భుతంగా పని చేసింది. సౌండ్‌తో ప్రేక్షకులను భయపెట్టే మ్యాజిక్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కథనం, థ్రిల్లర్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. చివరిలో పార్ట్ 2 కోసం ఇచ్చిన ట్విస్ట్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
మొత్తంగా, 'కిష్కింధపురి' ఒక మంచి హారర్ థ్రిల్లర్ సినిమా. ఇది ప్రేక్షకులను భయపెడుతూనే, అలరిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లో ఇది మరో హిట్ అవుతుందని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications