ఆ విషయంలో పవన్ భార్యపై ట్రోల్స్.. సపోర్ట్‌గా లేడీ సూపర్ స్టార్ !
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. వెంటనే మార్క్ శంకర్ కోసం చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్ హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్ళడం.. రెండు రోజులు అక్కడే ఉండడం.. కొడుకుని, భార్యని తీసుకుని పవన్ కళ్యాణ్ ఇండియాకు తిరిగి రావడం చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలోనే అన్నా లెజినోవా తిరుమలకు వెళ్లారు. శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలలోని గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు.
అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు. ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూ వరహా స్వామి దర్శనం అనంతరం కల్యాణకట్టకు చేరుకొని అక్కడ భక్తులందరితోపాటు తలనీలాలు సమర్పించారు. అంతే కాకుండా అన్నా లెజినోవా.. టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టుకు భారీ విరాళం అందించారు. అన్నవితరణకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పేరుతో రూ.17లక్షల చెక్కును అధికారులకు అందజేశారు.

అయితే అన్నా లెజినోవా తలనీలాలు సమర్పించడం మీద సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆమెకు మద్దతుగా నిలిచారు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయశాంతి.. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజినోవా ని కూడా ట్రోల్ చేసేవారిని తప్పు అని చెప్పక తప్పడం లేదని ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చారు.
ఈ మేరకు ఆ పోస్టులో.. దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా పై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అంటూ రాసుకొచ్చారు. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు.. ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తలనీలాలిచ్చి, అన్నదానం ట్రస్ట్‌కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారన్నారు.
దేశం కాని దేశం నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్నా లెజినోవాగారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు, ఆ…
— VIJAYASHANTHI (@vijayashanthi_m) April 15, 2025
గత రెండు రోజులుగా అన్నా ఇలా తలనీలాలు సమర్పించడాన్ని వ్యతిరేకిస్తూ.. గతంలో గరికపాటి మహిళలు తలనీలాలు సమర్పించడం గురించి చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్నారు. ఆడవాళ్లు కేవలం రెండు, మూడు కత్తెర్లు ఇస్తే చాలని.. భర్త ఉండగా ఇలా తలనీలాలు ఇవ్వకూడదని అంటున్నారు. ఇక విజయశాంతి సైతం ఆమెకు మద్దతుగా నిలవడంతో పలువురు ప్రముఖులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications