రూ.50 లక్షలతో తీస్తే రూ.60 కోట్లు కొల్లగొట్టిన మూవీ..!

సినిమా.. ప్రజలకు వినోదాన్ని అందించడమే కాదు సమాజాన్ని ప్రభావితం చేసే గొప్ప శక్తి కూడా. అందులోనూ భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి వారం థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు కొత్త కథలు, కొత్త ప్రయోగాలు, కొత్త జానర్స్ వరుసగా వస్తూనే ఉంటాయి. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ, VFX, కెమెరా క్వాలిటీ, కథ చెప్పే పద్ధతులు కూడా అప్డేట్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్‌లు కూడా భారీగానే పెరుగుతున్నాయి. కాగా దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన బాహుబలి మూవీ భారతీయ సినిచరిత్రలో ప్రభంజనం సృష్టించింది. 2015లో 'బాహుబలి: ది బిగినింగ్', 2017లో 'బాహుబలి: ది కన్‌క్లూజన్' పేర్లతో విడుదలై భారీ వసూళ్లను రాబట్టి కలెక్షన్స్ వర్షం కురిపించడమే కాకుండా రికార్డులు తిరగరసింది.

అయితే తక్కువ బడ్జెట్-భారీ కలెక్షన్స్ ఫార్ములా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దానికి వినూత్న కంటెంట్, కొత్త కథా శైలి, నేచురల్ నటన, రియలిస్టిక్ స్క్రీన్‌ప్లే ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. బలమైన కథాంశం, మౌత్ టాక్ (Mouth Talk) ద్వారా చిన్న చిత్రాలు కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రీసెంట్ గా తెలుగులో వచ్చిన పలు సినిమాలు భారీ కలెక్షన్స్ సాధించి ఈ విషయాన్ని నిరూపించాయి. కాగా ఇప్పుడు ఈ కోవలోనే గుజరాతీ చిత్ర పరిశ్రమ (Dhollywood) నుంచి వచ్చిన ఒక మూవీ సంచలనాలు సృష్టిస్తోంది.

lalo-gujarathi-movie-budget-is-50-lakhs-but-collected-60-crores

బడ్జెట్ రూ.50 లక్షలు.. కలెక్షన్లు రూ.60 కోట్లు+

'లాలో: కృష్ణ సదా సహాయతే'.. ఈ చిత్రానికి అంకిత్ సఖియా దర్శకత్వం వహించగా, కరణ్ జోషి ప్రధాన పాత్రలో నటించారు. అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ, అద్భుతమైన వసూళ్లతో ఇప్పుడు గుజరాత్ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు (టాప్ గ్రోసర్స్‌) సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం బడ్జెట్ పరంగా చిన్నదైనా, కలెక్షన్లలో మాత్రం భారీ రికార్డు సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం రూ.50 లక్షల తక్కువ బడ్జెట్‌తో రూపొందించబడింది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.60 కోట్లకు పైగా వసూలు చేసింది.

అయితే రిలీజ్ అయిన తొలి రోజులలో ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోకపోయినా.. ప్రేక్షకులలో వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ (Word-of-mouth) కారణంగా సినిమా కలెక్షన్లు ఊహించని విధంగా పెరిగాయి. ఈ చిత్ర కథాంశం ప్రేక్షకులను భావోద్వేగంగా కట్టిపడేసింది. కథ పూర్తిగా 'లాలో' అనే ఒక సాధారణ రిక్షా డ్రైవర్ చుట్టే తిరుగుతుంది. ఈ చిత్రం సాధారణ కుటుంబాల్లో జరిగే నిత్య జీవితం, సమస్యలు, ఆశలు, నమ్మకాలు వంటి అన్ని అంశాలను చాలా సహజంగా, బలమైన భావోద్వేగాలతో చూపించినదిగా నిలిచింది. ఈ చిత్రం గుజరాత్ ప్రేక్షకులతో బలంగా కనెక్ట్ అవడం ద్వారా ప్రాంతీయ సినిమాకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+