మెగా ఇంట్లో విషాదం..ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన లావణ్య త్రిపాఠి
మెగా కోడలు, నటి లావణ్య త్రిపాఠి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పెంపుడు కుక్క మృతి చెందింది. ఈ విషయాన్ని లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
"నేను ఇప్పటివరకు కలిసిన అత్యంత ముద్దుల కూతురు నువ్వు. వీలైతే నాకు టీ తయారు చేసి ఇస్తావని నేను అందరితో చాలాసార్లు చెప్పేదాన్ని. ఎంత అందమైన హృదయం, ఎంతో తెలివైనది.. అని పదే పదే అంటుంటాను. నువ్వు నిజంగా ప్రత్యేకమైనదానివి. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో, నా ముద్దుల ముద్దుబిడ్డ" అంటూ తన పోస్ట్‌లోరాసుకొచ్చింది. తన పెంపుడు కుక్కతో కలిసి దిగిన కొన్ని ఫొటోలు, వీడియోలను కూడా లావణ్య పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు ఆమెకు సంతాపం తెలియజేస్తూ "ఓం శాంతి" అని కామెంట్లు పెడుతున్నారు.

ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత సినిమా రంగానికి దూరమైన లావణ్య, ఇటీవల ఒక సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ తర్వాత తాను గర్భవతి కావడంతో ఆ షూటింగ్ కూడా మధ్యలోనే ఆపేసి, ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తన ప్రియమైన పెంపుడు జంతువును కోల్పోవడం ఆమెను మరింత బాధకు గురిచేసిందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications