ఏపీ రాజకీయాల్లో మహేష్ బాబు కామెంట్స్ వైరల్
ఏపీ రాజకీయాలు తుది అంకానికి చేరుకున్నాయి. ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలన్నీ కూడా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం పార్టీల అధినేతలు విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం పార్టీల అధినేతలు గట్టిగానే శ్రమిస్తున్నారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన , బీజేపీ పార్టీలు జత కట్టాయి. అధికారంపై ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాల్లో సినిమా వారి హంగామా కూడా అధికంగానే కనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ గెలుపు కోసం జబర్థస్త్ నటులు సైతం రంగంలోకి దిగారు. మెగా హీరో వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ,నాగబాబు ,ఆయన భార్య ప్రచారం నిర్వహిస్తున్నారు.పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కల్యాణ్ విసృతంగా ప్రచారం నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా డైలాగులు కూడా గట్టిగానే పేలుతున్నాయి.

తాజాగా మహేష్ బాబుకు సంబంధించిన డైలాగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధానంగా బిజినెస్ మ్యాన్ సినిమా డైలాగులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రచారంలో, ఇంటర్వ్యూల్లో నాయకులు మహేష్ బాబు డైలాగ్స్ వాడుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఇందులో భాగంగా మహేష్ బాబు బిజినెస్‌మెన్ డైలాగ్‌ను రిలేటెడ్‌గా చెప్పారు.
నేను ఊరికే రాలేదు. జెండా పాతడానికే వచ్చాను అంటారు అని యాంకర్ అనగా.. ఆయన అవును అన్నట్లుగా నవ్వుతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో పాటు భరత్ అనే నేను సినిమా డైలాగులు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications