మిస్ యు అమ్మ.. మహేష్ బాబు ఎమోషనల్.. అమ్మతో ఉన్న ఫోటో షేర్ చేసి..

దిల్లీకి రాజైనా కన్నతల్లికి మాత్రం కొడుకే.. అలాగే కోట్లమంది ఫ్యాన్స్ ఉన్నా.. వందల కోట్ల సంపాదన ఉన్నా కన్నతల్లి అనగానే చిన్నపిల్లలు అయిపోతారు ఎవరైనా. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తల్లిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. తన తల్లిని గుర్తుచేసుకున్నారు. మిస్ యూ అమ్మ అంటూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు సందర్భంగా ఆమెతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'మిస్ యు అమ్మ' అని క్యాప్షన్ ఇచ్చారు. ఆయన పంచుకున్న ఈ పోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇక మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి రెండేళ్ల క్రితం సెప్టెంబర్ 2022 లో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ఇందిరా దేవి పుట్టిన రోజుని గుర్తు చేసుకుంటూ తల్లితో దిగిన ఫోటో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే అమ్మ. మాటల్లో చెప్పలేనంత మిస్ అవుతున్నాను అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. పోస్ట్ చూసిన ఘట్టమనేని ఫ్యాన్స్ మహేష్ తల్లికి హ్యాపీ బర్త్ డే చెప్పారు. అలాగే ధైర్యంగా ఉండాలని మహేశ్ కు కామెంట్స్ చేస్తున్నారు.

Mahesh Babu Remembers His Mother with a Heartfelt Miss You Mom

ప్రస్తుతం మహేశ్ బాబు.. ప్రముఖ దర్శకుడు రాజమౌళి కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ప్రాజెక్ట్ 'SSMB 29'. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కెఎల్‌ నారాయణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

ఇటీవల ఒడిశాలోని అడవుల్లో ఓ కీలక షెడ్యూల్ పూర్తిచేసింది చిత్రయూనిట్. ఈ షెడ్యూల్ తర్వాత మహేశ్ తన ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్ వెళ్లి వచ్చారు. ఇక ఈ చిత్ర తదుపరి షెడ్యూల్‌లో భాగంగా నీటిలో ఓ భారీ బోట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే షెడ్యూల్‌లో మహేశ్, ప్రియాంక, పృథ్వీరాజ్‌తో పాటు దాదాపు 3 వేల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌ లు పాల్గొంటారని సమాచారం. ఇక ఈ మూవీ వచ్చే 2027 వేసవిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+