మెగా డాటర్‌కు మహేష్ బాబు మెసేజ్

మెగా డాటర్ నిహారిక విడాకుల తర్వాత ఫుల్ యాక్టివ్‌గా మారారు. విడాకులు అనంతరం నిహారిక సినిమాలు, షోలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదే సమయంలో నిర్మాతగా కూడా ఆమె ఎంట్రీ ఇచ్చారు.నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్‌పై ''కమిటీ కుర్రాళ్లు'' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు నిహారిక. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఇటీవలే సిద్దు జొన్నలగడ్డ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయించారు.

మెగా హీరోలు సైతం ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశారు. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అందరు కొత్త వాళ్లతో తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. గ్రామంలోని 11 మంది కుర్రాళ్లకు ,సర్పంచ్‌కు మధ్య జరిగే కథగా ''కమిటీ కుర్రాళ్లు'' తెరెక్కించాడు దర్శకుడు. గ్రామీణ రాజకీయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భతంగా ఉందని సినీ పండితులు చెబుతున్నారు.

Mahesh Babu s Appreciation Tweet on Niharika s Committee Kurrollu Movie

మరోవైపు సినిమా చూసిన సెలబ్రిటీలు సైతం ''కమిటీ కుర్రాళ్లు''పై రియాక్ట్ అవుతున్నారు. ఈక్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాపై తన స్పందనను తెలియజేశారు. సినిమా యూనిట్‌పై మహేష్ బాబు అప్రిసియేషన్ ట్వీట్ చేశారు. ' 'కమిటీ కుర్రోళ్ళు' గురించి గ్రేట్ థింగ్స్ వింటున్నా. నీ డెబ్యూ ప్రొడక్షన్ సక్సెస్ పై కంగ్రాట్స్ నిహారిక. టోటల్ టీంకు కూడా శుభాకాంక్షలు. త్వరలో సినిమా చూస్తాను ' అంటూ రాసుకొచ్చాడు. మహేష్ బాబు రియాక్ట్ కావడంతో ''కమిటీ కుర్రాళ్లు'' పై బజ్ ఏర్పడింది. సగటు ప్రేక్షకుడు ఈ సినిమాను చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన రీ రిలీజ్ మురారి సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+