'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్ వైరల్.. ఇదే నిజమైతే బాక్సాఫీస్ బద్దలే..!

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వారణాసి మూవీ ఏప్రిల్ 7న విడుదల కానుంది. వారణాసి మూవీలో మహేష్ బాబు కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. మాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్ర చేస్తున్నారు.

ఈ మూవీకి ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ కే.ఎల్. నారాయణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. వారణాసి మూవీ దాదాపు రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ కీలక అప్డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వారణాసి మూవీని ప్రపంచవ్యాప్తంగా 120 కు పైగా దేశాల్లో, 50 కు పైగా అంతర్జాతీయ, ప్రాంతీయ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లోకి వారణాసి సినిమాను తీసుకెళ్లేందుకు రాజమౌళి తన మార్క్ స్ట్రాటజీని ఎంచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాల్లోకి ఏఐ వినియోగం విపరీతంగా వచ్చేసింది. డబ్బింగ్ కోసం చాలామంది ఏఐ మీదే ఆధారపడుతున్నారు. అయితే వారణాసి విషయంలో మాత్రం రాజమౌళి ఈ విధానానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

యాక్టర్స్ గొంతులోని సహజత్వం, భావోద్వేగాలు, డైలాగ్ డెలివరీలోని తీవ్రత ఇలా ప్రతిభాషలోని ఆడియన్స్ కు క్లియర్ గా చేరాలంటే స్థానికంగా ఉన్న ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టుల ద్వారానే ఇది సాధ్యం అని దర్శకధీరుడు రాజమౌళి భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1600 మందికి పైగా డబ్బింగ్ ఆర్టిస్టులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే ప్రపంచవ్యాప్తంగానూ వారణాసి మూవీని చేరువ చేయడానికి రాజమౌళి ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రాజమౌళి పనితీరే వేరు అంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

maheshbabu Varanasi in 50 languages Rajamouli creates a sensation with 1 600 dubbing artists

ఇక ఇటీవల మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా వారణాసి మూవీ నుంచి రెండు ఫొటోలు రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో ఇన్ స్టంట్ గా వైరల్ అయ్యాయి. ఈ పోస్టు కింద రాజమౌళి మహేష్ బాబు పాత్రను వివరించే ప్రయత్నం చేశారు. 'రుద్ర' అనే పేరు వినగానే ఆగ్రహం, ఆవేశం, శక్తి, రౌద్రం వంటి లక్షణాలు గుర్తుకొస్తాయి. అయితే ఈ పాత్ర అంతే పరిమితమైనది కాదని రాజమౌళి తన పోస్టులో స్పష్టం చేశారు. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+