రామ్ చరణ్ కవలల డెలివరీ ముహూర్తం ఫిక్స్ చేసింది ఇతనే..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించిన విషయం తెలిసిందే. ఉపాసన ఓ బేబీ గర్ల్, బేబీ బాయ్ కు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంది. అయితే రామ్ చరణ్, ఉపాసనల కవల పిల్లలకు సంబంధించి ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వారి డెలివరీకి ముహూర్తం పెట్టింది ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు.. ఆయనే ప్రముఖ జ్యోతిష్యుడు మహేష్ బాంగ్..
రామ్ చరణ్, ఉపాసన దంపతుల కవలల డెలివరీకి ముహూర్తం పెట్టింది ఎవరో కాదు.. ప్రముఖ జ్యోతిష్యుడు మహేష్ బాంగ్ అని తెలుస్తోంది. మహేష్ బాంగ్.. బాలీవుడ్ సెలబ్రిటీలకు వ్యక్తిగత జ్యోతిష్యుడుగా సేవలు అందిస్తున్నారు. ఆయన కోవిడ్ 19 గురించి ముందే హెచ్చరించినట్లు కథనాలు ఉన్నాయి. దాదాపు 3 దశాబ్దాలకుపైగా ఆయనకు జ్యోతిష్యంలో పట్టు ఉన్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించిన విషయం తెలిసిందే. ఉపాసన.. అపోలో ఆసుపత్రిలో జనవరి 31న రాత్రి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయానికి సంబంధించి ఆమె తన ఇన్ స్టా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆ పిల్లలకు ప్రసవం చేసిన వైద్యులు, సాయపడిన నర్సులు, ఆసుపత్రి యాజమాన్యం అందరూ కనిపించడం విశేషం. అలాగే మహేష్ బాంగ్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. తానే జనవరి 31 రాత్రి 11:30 గంటల తర్వాత ముహూర్తాన్ని నిర్ణయించి చెప్పినట్టు వివరించారు. దీంతో మహేష్ బాంగ్ మరోసారి ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అయ్యారు.

ఇక బాలీవుడ్ లోనూ ఎంతో మంది టాప్ సెలబ్రిటీలకు మహేష్ బాంగ్ వ్యక్తిగత జ్యోతిష్యుడుగా ఉన్నారు. ఆయన ఎన్నో సినిమాలకు ముహూర్తాలు పెట్టారు. బాలీవుడ్ సెలెబ్రిటీ పెళ్లిళ్లకు కూడా ముహూర్తాలను పెట్టారు. ఇక మహేష్ బాంగ్ స్వస్థలం రాజస్థాన్ లోని జైపూర్ కాగా.. ప్రస్తుతం ఆయన దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో నివసిస్తున్నారు. అక్కడి పత్రికల్లో ఆయన ప్రత్యేకంగా జ్యోతిష్య కాలమ్స్ కూడా రాస్తుంటారట.












Click it and Unblock the Notifications