"నాకు మమితా బైజును పెళ్లి చేసుకోవాలని ఉంది.. లైఫ్ లో ఆమెను తప్ప ఎవ్వరినీ ఊహించుకోలేను"
తమిళ్ ఫిల్మ్ క్రిటిక్ సంతోష్ వార్కే గురించి అందరికీ తెలిసిందే. సినిమాలపై తనదైన శైలిలో సెటైరికల్, వివాదాస్పదంగా రివ్యూలు ఇస్తూ మలయాళంలో పాపులర్ అయ్యారు. మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ఆరట్టు చిత్రంపై ఇచ్చిన రివ్యూతో ఆయన ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన్ను అంతా "ఆరట్టు అన్నన్" అని పిలుస్తుంటారు. యూట్యూబ్ లో ఈయన వీడియోలు, ఇన్ స్టాగ్రామ్ లో మీమ్స్ చాలా పాపులర్ అవుతుంటాయి. అయితే తాజాగా మలయాళం ముద్దుగుమ్మ మమితా బైజుపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
మమితా బైజుపై తనకున్న ప్రేమను బహిరంగంగానే ఫేస్ బుక్ పోస్టు ద్వారా ఆయన వ్యక్తం చేశారు. తనను పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపారు. "ఐ లవ్ మమితా బైజు.. నాకు ఆమెను వివాహం చేసుకోవాలని ఉంది. ఆమె నటించిన బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ మూవీని ఇప్పుడు మూడోసారి చూస్తున్నాను. మా ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ ఆమె మాయలో నేను పడిపోయాను. ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉంది. ఇప్పటినుంచి నా జీవితంలో మమిత తప్ప మరో మహిళకు చోటు లేదు. నేను అంతలా ఆమెను ఇష్టపడుతున్నాను" అని ఫిల్మ్ క్రిటిక్ సంతోష్ వార్కే తనదైన శైలిలో ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అయితే గతంలో నటి నిత్యా మీనన్ పైనా సంతోష్ వార్కే ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నిత్యామీనన్ ను సైతం పెళ్లి చేసుకోవాలని ఉందని కామెంట్స్ చేశారు. ఇదే విషయంపై అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ మాట్లాడుతూ.. సంతోష్ వార్కే తనను పెళ్లిచేసుకుంటానని ఆరేళ్లకు పైగా వేధించాడని తెలిపారు. దాదాపు 30 ఫోన్ నెంబర్స్ నుంచి కాల్ చేసి విసిగించేవాడని కీలక ఆరోపణలు చేశారు. అయితే ఆ తర్వాత వాటిని సంతోష్ వార్కే ఖండించారు. ఇక మమితా బైజు విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె సూపర్ ఫామ్ లో దూసుకెళ్తున్నారు. ప్రేమలు చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకున్న మమితా బైజు ఆ తర్వాత డ్యూడ్, జన నాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్తున్నారు.












Click it and Unblock the Notifications
