నష్టాల్లోంచి ఉదయ్ కిరణ్ ఆ నిర్మాతను కాపాడారు.. కానీ..
'చిత్రం', 'నువ్వు నేను' సినిమాలతో హీరోగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత మనసంతా నువ్వే చిత్రంతో యాట్రిక్ హిట్స్ కొట్టిన యంగ్ హీరోగా కొత్త చరిత్ర లిఖించారు ఉదయ్ కిరణ్. దేవిపుత్రుడు సినిమాతో నిర్మాత ఎంఎస్ రాజుకు భారీ లాస్ వచ్చింది. దీంతో ప్రయోగాలకు పోకండా ఓ స్వచ్చమైన లవ్ స్టోరీ తీయాలన్న ఆలోచన వచ్చింది ఆయనకు .
వీఎన్ ఆదిత్య అనే కొత్త డైరెక్టర్ తో నిర్మాత ఎంఎస్ రాజు.. ఉదయ్ కిరణ్ హీరోగా పెట్టి మనసంతా నువ్వే సినిమా తీశారు. అయితే బాగుంటుందని భావించారట. అలా ఈ ప్రాజెక్ట్ లోకి ఉదయ్ కిరణ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు ఆర్ పీ పట్నాయక్ సంగీతం అందిచారు. 2001 అక్టోబరు 19న ఈ మూవీ రిలీజైన ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. భారీ హిట్ కొట్టింది. దీంతో దేవి పుత్రుడుతో లాస్ లో ఉన్న ఎంఎస్ రాజు ఈ మూవీతో లాభాల్లోకి వచ్చారు. కానీ ఉదయ్ కిరణ్ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఏ నిర్మాత ఆయన వద్దకు వచ్చి ధైర్యం చెప్పే సాహసం చేయలేదు.

అలా ఎంతో మంది నిర్మాతలకు లాభాలు ఇచ్చి .. తాను మాత్రం ఆర్థిక ఇబ్బందులతో బలైపోయారు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ 2014 జనవరి 5 న హైదరాబాద్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకున్నారు. అప్పుడ ఆయన వయసు 33 ఏళ్లు. పోలీసులు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అయితే ఆయన మరణానికి ఆర్థిక ఇబ్బందులు లేదా ఇతర కారణాలు ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications