మెగా హీరోలతో సినిమా చేస్తే డిజాస్టర్లే..ఎన్ని వందల కోట్ల నష్టమో తెలుసా..!
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇంకా చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీ తర్వాత మెగా ఫ్యామిలీనే ఇండస్ట్రీని ఏలుతోంది. చిరంజీవి.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు...వెలుగుతున్నారు కూడా. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ వన్ హీరోగా చిరంజీవి నిలిచారు.ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు.
దాదాపు 30 ఏళ్ల పాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు. ఎన్టీఆర్ తర్వాత నెంబర్ స్థానం కోసం చాలామంది హీరోలు పోటీ పడ్డారు. చిరంజీవితో పాటు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సినీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు నెంబర్ స్థానం కోసం పోటీ పడ్డారు. కానీ చిరంజీవి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

చిరంజీవి తర్వాత ఆయన ఫ్యామిలీ నుంచి పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, సుస్మిత వంటి వారు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నేరుగా సినిమాల్లో పని చేయనప్పటికీ, మెగా ఫ్యామిలీ హీరోలు నటిస్తోన్న సినిమాలకు డిజైనర్‌గా పని చేస్తున్నారు.అయితే గత కొంతకాలంగా మెగా హీరోలకు బ్యాడ్ టైం నడుస్తోంది. మెగా హీరోలు ఏ సినిమా తీసినా ఫ్లాప్ అవుతోంది.
ఇంకా చెప్పాలంటే డిజాస్టార్లే.చిరంజీవి దగ్గర నుంచి వైష్ణవ్ తేజ్ వరకు అందరూ కూడా ఫ్లాప్‌ల్లోనే ఉన్నారు. చిరంజీవి నటించిన భోళా శంకర్ ఏకంగా రూ.55 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఆచార్య సైతం భారీ నష్టాలను మిగిల్చింది.మరోవైపు, పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు హరి హర వీరమల్లు రూ.85 కోట్లు , , బ్రో రూ.40 కోట్ల నష్టాన్ని తీసుకొచ్చాయి. ఇది కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలతోనే దాదాపు రూ.125 కోట్ల నష్టం.
ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రూ.100 కోట్ల నష్టంతో భారీ డిజాస్టర్‌గా నిలిచింది. వరుణ్ తేజ్ నటించిన మూడు సినిమాలు గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా అన్నీ కలిపి రూ.80 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. అలాగే వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ సైతం రూ.27 కోట్ల నష్టానికి కారణమైంది. మొత్తంగా, గత రెండేళ్లలో 8 మెగా చిత్రాలు దాదాపు రూ.500 కోట్ల భారీ నష్టాలను చవిచూశాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిలో రాబోయే విశ్వంభర, ఓజీ వంటి చిత్రాలపైనే మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.












Click it and Unblock the Notifications