బిగ్ బ్రేకింగ్: రామ్ చరణ్ కీలక నిర్ణయం

ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. భారతీయుడు2 షూటింగ్ లో శంకర్ పాల్గొనడటంతో గేమ్ ఛేంజర్ వాయిదా పడుతూ వచ్చింది. ఎప్పుడు విడుదలవుతుందనే విషయమై ఇంతవరకు చిత్ర యూనిట్ నుంచి స్పష్టత రాలేదు. ఆ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ మినహా ఎటువంటి అప్ డేట్ లేదు.

ఎలాగైనా దీన్ని పూర్తిచేసి విడుదల చేద్దామనుకునే సమయానికి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొచ్చింది. దీంతో మరోసారి ఈ సినిమా వాయిదా పడినట్లే అంటున్నారు. దీనితర్వాత ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. గేమ్ ఛేంజర్ ఎలాగూ వాయిదా పడింది కాబట్టి బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ అయినా ప్రారంభమవుతుందని ఆశించారు.

mega power star ramcharan key decision on latest movies

తాజాగా రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు నెలలపాటు సినిమా షూటింగ్స్ కు విరామం ప్రకటించి కుటుంబంతో కలిసి గడపాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాతే బుచ్చిబాబు సెట్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో దీన్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు రచించారు. ఈ సినిమాకు ఏకంగా ఏడాది సమయం తీసుకోవడం చాలా దారుణమని అభిమానులు హర్ట్ అవుతున్నారు.

ప్లీజ్ రామ్ చరణ్ అలా మాత్రం చేయకు అంటూ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాను త్వరగా పూర్తిచేస్తేనే హిట్ టాక్ వస్తుందని, అది కెరీర్ కు ప్లస్ అవుతుందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత హీరోగా పూర్తిస్థాయిలో సినిమా ఇంతవరకు రాలేదని, ఇలాగే ఏళ్లకు ఏళ్లు గడిచిపోతుంటే చివరకు అభిమానులు కూడా మర్చిపోతారంటున్నారు. అభిమానుల ఆవేదనపై రామ్ చరణ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+