చరిత్ర సృష్టించిన చిరంజీవి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్

క్యారెక్టర్ నటుడిగా, ప్రతినాయకుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి తర్వాత స్వయంకృషితో ఒక్కో మెట్టు అధిరోహిస్తూ మెగాస్టార్ గా అవతరించారు. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక స్థాయిలో అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. చిరంజీవి సినిమా అంటే ఇంటిల్లిపాదీ వెళ్లి మరీ చూస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో 40 సంవత్సరాల కాలంలో సుప్రీంహీరో స్థాయి నుంచి మెగాస్టార్ కు చేరుకున్న చిరు ఖాతాలో లేని రికార్డులు లేవంటే అతిశయోక్తి కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవలే పద్మవిభూషణ్ తో సత్కరించింది. భారతీయ సినీరంగానికి ఆయన చేసిన సేవలకు, ఐబ్యాంక్, బ్లడ్ బ్యాంకు వంటి సామాజిక సేవలకు ఈ అవార్డు దక్కింది.

పసివాడి ప్రాణంతో బ్రేక్ డ్యాన్స్
తాజాగా మెగాస్టార్ చిరు ఖాతాలో మిగిలివున్న గిన్నిస్ రికార్డు కూడా చేరబోతోంది. చిరంజీవి తన సినిమాల్లో నృత్యాలకు ఎక్కువ ప్రాధాన్యత వేసేవారు. మంచి మంచి నృత్యాలతో, విభిన్నమైన స్టెప్పులతో అలరించారు. పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డ్యాన్స్ ను పరిచయం చేశారు. కొండవీటి దొంగ సినిమాల్లో స్లోమోషన్ మూమెంట్స్ ప్రవేశపెట్టారు. డ్యాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డ్యాన్స్ అనేలా తెలుగు సినిమాకు పర్యాయపదంలా మారారు. ఆయన కీర్తి కిరీటంలో మరో కిలికితురాయి చేరబోతోంది. అత్యధిక పాటలకు నృత్యం చేసిన నటుడిగా చరిత్ర సృష్టించారు. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్ వారు ఆయన్ను గౌరవించబోతున్నారు.

mega star Chiranjeevi is named in the Guinness Book of World Records

అతిరథ మహారధుల సాక్షిగా

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, గిన్నిస్ బుక్ ప్రతినిధులు హైదరాబాద్‌లో చిరంజీవికి ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత, దర్శకులు, అతిరథ మహారథులంతా పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి గతంలో గిన్నిస్ బుక్ లోకి ఎక్కినవారిలో నిర్మాత డి.రామానాయుడు, హాస్యనటుడు బ్రహ్మానందం పేర్లు సంపాదించుకున్నారు. తాజాగా చిరంజీవి పేరు కూడా చేరబోతోంది.

mega star Chiranjeevi is named in the Guinness Book of World Records

భవిష్యత్తులో మరెన్ని రికార్డులను చిరు అధిరోహిస్తారో చూడాలి. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పాటలకు ఆయన నిర్విరామంగా నృత్యం చేశారు. అలుపన్నది ఎరగకుండా 69 సంవత్సరాల వయసులోను యువ హీరోలకు ధీటుగా కొత్త కొత్త స్టెప్పులను వేస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+