అనారోగ్యంతో మెగాస్టార్ చిరంజీవి.... 25 రోజులుగా చికిత్స
మెగాస్టార్ చిరంజీవి ఖాతాల్లో ఎన్ని రికార్డులు ఉన్నాయో చిరంజీవికే తెలియదు. అన్ని రికార్డులను సాధించారు. తాజాగా చిరు ఖాతాలో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు చేరింది. హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ లో గిన్నిస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చేతులమీదుగా దీన్ని అందించారు. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులంతా హాజరయ్యారు. 156 సినిమాల్లో 537 పాటలకు నృత్యం చేశారు. అలాగే 24 డ్యాన్స్ మూమెంట్స్ ప్రదర్శించారు. వందల సంఖ్యలో పాటలకు నృత్యం చేసినందుకు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు చిరు.
చేయిపట్టుకొని నడిపించిన సాయిధరమ్ తేజ్
చిరంజీవి ఈ వేదికమీదకు వచ్చే సమయంలో ఎంతో నీరసంగా కనిపించారు. ఆయన్ను సాయిధరమ్ తేజ్ చేయిపట్టుకొని నడిపించుకొని తీసుకొచ్చారు. నడిచేందుకు కూడా ఎంతో కష్టపడ్డారు. చిరంజీవికి ఏమైందా? అంటూ అందరూ ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్న వ్యక్తి ఓ విషయాన్ని బయటపెట్టారు. 25 రోజులుగా మెగాస్టార్ చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నారని, చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. అవార్డు తీసుకునేందుకు అతి కష్టంమీద వచ్చారన్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో చిరంజీవికి మద్దతుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

చిరంజీవి వెంటనే కోలుకోవాలి
చిరంజీవి వెంటనే కోలుకోవాలని, ఆయనకు సత్వరమే ఆరోగ్యం చేకూరాలంటూ పోస్టులు పెడుతున్నారు. చిరంజీవి కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి విశ్వంభర చిత్రం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి విడుదల కాబోతోంది. త్రిష కథానాయికగా నటిస్తోంది. సోషియా ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. దీని తర్వాత ఎవరితో చేయాలనే విషయమై చిరంజీవి కథలు వింటున్నారు. హరీష్ శంకర్ కూడా ఓ కథను వినిపించారు. మిస్టర్ బచన్ సినిమా ఫ్లాపవడంతో హరీష్ శంకర్ తో సినిమా చేసే విషయంలో చిరు పునరాలోచనలో పడ్డారు.












Click it and Unblock the Notifications