'విశ్వంభర'లో కూడా మళ్లీ వేలు పెట్టిన చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన వివాదాలు, వివాదాస్పద కామెంట్లు ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ ఆచార్యకు సంబంధించినవారి నుంచి వస్తూనే ఉంటాయి. ఆచార్యలో చిరంజీవి వేలు పెట్టడంవల్లే అప్పటివరకు సూపర్ హిట్లు ఇచ్చిన కొరటాల ఫ్లాప్ సినిమా ఇవ్వాల్సి వచ్చిందని చిరంజీవి వ్యతిరేక అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటారు. అటువంటిదేమీలేదని, డైరెక్టర్ సరిగా చేయకపోతే జోక్యం చేసుకోరా? అని చిరంజీవి అభిమానులు ఎదురుదాడికి దిగేవారు.

స్వయంగా పర్యవేక్షిస్తున్న చిరంజీవి
తాజాగా విశ్వంభర సినిమా టీజర్ విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. వీఎఫ్ఎక్స్ నాణ్యతపై వ్యతిరేకత వ్యక్తమైంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ జరుగుతోంది. గ్రాఫిక్స్ నాణ్యంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని చిన్న పిల్లవారు సైతం చెప్పగలడు. విశ్వంభర వీఎఫ్ ఎక్స్ కూడా ఆదిపురుష్ తరహాలో ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో గ్రాఫిక్స్ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తనతో ఎంతో సన్నిహితంగా ఉండే ఇద్దరు దర్శకులతోపాటు కెమెరామెన్ చోటాకే నాయుడుతో కలిసి చర్చిస్తున్నట్లు సమాచారం.

megastar Chiranjeevi himself supervises Vishwambhara Graphics

దర్శకుడు వశిష్టకు ఇబ్బంది లేకుండా..
కల్యాణ్ కృష్ణ సినిమాకు ఓకే చెప్పి మరీ దాన్ని వాయిదా వేసి వశిష్ట సినిమా చేస్తున్నారు చిరంజీవి. దీంతో రాజీపడకుండా సినిమా రావాలనే ఉద్దేశంలో చిరు ఉన్నారు. ఇంతకుముందు వచ్చిన భోళాశంకర్ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దర్శకుడు వశిష్టకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలని చిరంజీవి వారితో చర్చిస్తున్నారు. సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఎక్కువ సమయం ఉండటంతో నాణ్యత ఎక్కడ దెబ్బతిందో చూసుకొని వాటిని సరిచేస్తున్నారు. అయితే టీజర్ లో చూపించిన సన్నివేశాలు సినిమాలో లేవని, ఏఐ ద్వారా వాడితే అవే ఇబ్బంది పెట్టాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. టీజర్ ద్వారా వచ్చిన విమర్శలు ట్రైలర్ కు రాకుండా చూసుకోవాలి. అందుకే వీఎఫ్ఎక్స్ పై చిత్ర యూనిట్ చర్చోపచర్చలు జరుపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+