మెగాస్టార్ కోసం ఎవరూ చేయని సాహసం చేసిన మహిళా అభిమాని !
కష్టేఫలి.. కృషితో నాస్తి దుర్భిక్షం.. వంటి మాటలకు అసలైన అర్ధం లాగా అనిపిస్తారు " మెగాస్టార్ చిరంజీవి ". నటుడిగా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగి మెగాస్టార్ గా తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటుడిగానే కాకుండా సేవాతత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు చిరంజీవి. అయితే సినీ తెరపై మాత్రమే కాకుండా నిజజీవితంలోనూ ఆయన చూపించే స్ఫూర్తిదాయకమైన మానవతా విలువలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఏం జరిగిందంటే..
నటీనటులపై అభిమానులు ఒక్కో రకంగా బయటపెడుతుంటారు. ఒక్కోసారి వారు చూపే ప్రేమాభిమానాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సాధారణంగా ఎక్కువగా ఇలాంటి పనులు మగవారు చేస్తూ ఉంటారు. కానీ అనూహ్యంగా ఓ మహిళా అభిమాని చిరంజీవిపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఆయనను చూసేందుకు సైకిల్‌పై 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నారు.

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరి అనే వీరాభిమాని చిరంజీవిని ఒక్కసారి అయినా చూడాలనే కోరికతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. సైకిల్‌పై 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేస్తూ హైదరాబాద్ చేరుకున్నారు. ఎన్నో శారీరక సవాళ్లు ఎదురైనా కానీ చిరంజీవిపై ఉన్న అపారమైన ప్రేమ, అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపించింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. రాజేశ్వరిని హృదయపూర్వకంగా తన ఇంటికి ఆహ్వానించారు.
ఆమెకు తనపట్ల ఉన్న అభిమానానికి చలించిపోయిన చిరు ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా రాజేశ్వరి.. మెగాస్టార్ కి రాఖీ కట్టగా, ఆమెకు ఆశీస్సులు అందించి చీరను బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె పిల్లల విద్యను పూర్తిగా తన భాధ్యతగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. వారు ఎంత వరకూ చదువుకుంటే అంతవరకూ ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పారు. ఈ విషయం సోషల్ మీడియాలో సైతం వైరల్ కావడంతో ప్రతి ఒక్కరూ "దటీజ్ మెగాస్టార్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సైకిల్‌పై ఆదోని toహైదరాబాద్.. లేడీ ఫ్యాన్ అభిమానానికి మెగాస్టార్ ఫిదా ..!!#MegastarChiranjeevi #Chiranjeevi #FemaleFan #Adoni #Hyderabad #ReelTalk #OIUpdates #Oneindiatelugu pic.twitter.com/KSuIeZUrJo
— oneindiatelugu (@oneindiatelugu) August 29, 2025
ప్రస్తుతం చిరంజీవి వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర' సోషియో ఫాంటసీ చిత్రంగా వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'మన శంకరవర ప్రసాద్‌గారు' 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇవి కాకుండా బాబీ కొల్లి దర్శకత్వంలో, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరిన్ని చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications