'మురారి'ని టచ్ కూడా చేయలేకపోయిన 'ఇంద్ర'!

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర కథానాయకుల సినిమాలను తిరిగి విడుదల చేసే ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలంతా సంవత్సరానికి, లేదంటే రెండు మూడు సంవత్సరాలకు మాత్రమే ఒక సినిమా చేస్తూ ఉండటంతో వారు గతంలో చేసిన పాత సినిమాలే థియేటర్లలో విడుదల చేసి అభిమానులు ఆనందాన్ని పొందుతున్నారు. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి 16 సినిమాలు చేశారు. అలా చేయడంవల్ల నిర్మాతలు బాగుండేవారు.. థియేటర్ల యాజమాన్యం సంతోషంగా ఉండేది.. ప్రేక్షకులు సినిమాలు చూడటానికి తండోపతండాలుగా థియేటర్లకు వచ్చేవారు.

ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్లు
ప్రస్తుతం మన తెలుగు హీరోలంతా పూర్తి కమర్షియల్ అయ్యారు. రెండు సంవత్సరాలకోసారి సినిమా చేయడం.. దానికి తగ్గట్లుగా రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం.. వాటిని ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం. ఇదీ మన తెలుగు హీరోలు చేస్తున్న పని. పరిశ్రమలోని ఇతర విభాగాలకు పని కల్పించడానికి, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడానికి వీరు తీసుకునే చర్యలు శూన్యం. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారిని గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.5.4 కోట్ల గ్రాస్ రాబట్టింది. మొత్తంగా రూ.9 కోట్లు వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది.

megastar chiranjeevi movie indra not beaten mahesh babu murari collections record

కిక్కిరిసిన థియేటర్లు
చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని ఇంద్ర సినిమాను రీరిలీజ్ చేశారు. ఈ సినిమా మురారి రికార్డును బ్రేక్ చేస్తుందని భావించారుకానీ అలా చేయలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా 385 థియేటర్లలో వైజయంతీ మూవీస్ ఇంద్రను విడుదల చేసింది. చిరంజీవి జన్మదినం కావడంతో థియేటర్లన్నీ కిక్కిరిసిపోయాయి. అయితే సినిమా వసూళ్లలో మాత్రం మురారి మొదటిరోజు వసూలు చేసిన కలెక్షన్ల రికార్డును టచ్ చేయలేకపోయింది. మొదటిరోజు ఇంద్రకు రూ.3.05 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. రీరిలీజ్ సినిమాల్లో ఇంద్ర సినిమా మంచి కలెక్షన్లు సాధించడమే కాకుండా మెగా అభిమానులకు ఎంతో సంతోషాన్ని కల్పించింది. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం మహేష్ బాబు మురారిరి కేవలం టచ్ కూడా చేయలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+