చిరంజీవి ఎన్ని ఇండస్ట్రీ హిట్ సినిమాలు రిజెక్ట్ చేశారో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి క్యారెక్టర్ నటుడిగా పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రతినాయకుడిగా కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా హీరోగా అవకాశాలు వస్తుండటంతో సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిన ఖైదీ సినిమాకు డేట్లు ఖాళీలేక కృష్ణ వదులుకున్నారు. దీంతో ఆ సినిమాను చిరంజీవితో తీయగా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత చిరంజీవి వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. తర్వాత సుప్రీంహీరోగా మారారు. అక్కడి నుంచి మెగాస్టార్ అయ్యారు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. తన వారసుడిగా వపన్ కల్యాణ్, రామ్ చరణ్ ను తీసుకువచ్చారు.
ముందుగా చిరు దగ్గరకే వచ్చిన సినిమాలు
కెరీర్ బిజీగా ఉన్న సమయంలో చాలా సినిమాలు చిరు దగ్గరకు వచ్చాయికానీ కొన్ని కథలు నచ్చక, మరికొన్ని డేట్లు ఖాళీలేక వదులుకోవాల్సి వచ్చింది. అలా వదులుకున్న సినిమాల్లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో అర్జున్ నటించిన మన్నెంలో మొనగాడు, బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున నటించిన ఆఖరి పోరాటం, బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన నెంబర్ వన్, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకీ నటించిన సాహసవీరుడు - సాగరకన్య, పి.వాసు దర్శకత్వంలో రజనీకాంత్ నుంచి వచ్చిన సంచలన చిత్రం చంద్రముఖి, వంశీ దర్శకత్వంలో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలన్నీ ముందుగా చిరంజీవి దగ్గరకే వచ్చాయి. అనివార్య కారణాలతో వాటిని వదులుకోవాల్సి వచ్చింది.

షూటింగ్ ప్రారంభమై ఆగిపోయిన సినిమాలు
ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా వదులుకున్నారు. అలాగే షూటింగ్ ప్రారంభమై పూర్తవకుండా ఆగిపోయిన సినిమాలు కూడా పది వరకు ఉన్నాయి. వాటిల్లో సురేశ్ కృష్ణ, రామ్ గోపాల్ వర్మ, కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు లాంటి దర్శకుల చిత్రాలు కూడా ఉన్నాయి. ఏకమైనప్పటికీ మెగాస్టార్ గా అవతరించిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి వెనక్కివచ్చి తన రెండో ఇన్నింగ్స్ లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర చేస్తున్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారు.












Click it and Unblock the Notifications