బాధపెట్టి ఉంటే క్షమించండి.. ఫ్యాన్స్ ఆగ్రహానికి మోహన్ లాల్ ఎమోషనల్
మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఎల్2 ఎంపురాన్ . 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్ కు కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాకు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. వేసవి కానుకగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎల్2 ఎంపురాన్. రిలీజ్ రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తో దూసుకెళ్తోంది ఈ మూవీ. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల్లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో రీ సెన్సార్ చేసింది చిత్రబృందం. రీ సెన్సార్ చేసిన అనంతరం దాదాపు 17 కట్స్ ఓకే చేసి ఆ సీన్స్ లేకుండానే మూవీని విడుదల చేసింది.
అయితే తాజాగా మరోసారి ఈ మూవీ చిక్కుల్లో పడింది. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ గుజరాత్ అల్లర్లను ఉద్దేశించి ఉండడంతో పలువురు చిత్రబృందంపై మండిపడుతున్నారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దీంతో ఎల్2 ఎంపురాన్ బ్యాన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హీరో మోహన్ లాల్ స్పందించారు. అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

" ఎంపురాన్-2 మూవీలో వచ్చిన కొన్ని రాజకీయ, సామాజిక ఇతివృత్తాల సీన్లు చాలా మందికి మనోవేదనను కలిగించాయని నాకు తెలుసు. ఒక ఆర్టిస్ట్‌గా నా సినిమాలేవీ రాజకీయ ఉద్యమం, భావజాలం, వర్గం పట్ల ద్వేషాన్ని కలిగి ఉండకుండా చూసుకోవడం నా కర్తవ్యం. మా సినిమా మిమ్మల్ని బాధపెట్టినందుకు చింతిస్తున్నాం. అందుకే ఎంపురాన్ టీమ్ తరఫున క్షమాపణలు చెబుతున్నా. మిమ్మల్ని బాధపెట్టేలా ఉన్న సీన్స్ తప్పనిసరిగా తొలగించాలని డిసైడ్ అయ్యాం. గత నాలుగు దశాబ్దాలుగా మీలో ఒకరిగా నా సినీ జీవితాన్ని గడిపాను. మీ ప్రేమ, విశ్వాసమే నా బలం.. ప్రేమతో మీ మోహన్ లాల్' అంటూ ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం మోహన్ లాల్ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications