మృణాల్ ఠాకూర్ కు బ్లాక్ బస్టర్ ఆఫర్
'సీతారామం' చిత్రంతో సినీ ప్రియులందరినీ ఆకట్టుకోవడమేకాదు.. అందరినీ తనవైపే తిప్పుకుంది ముద్దుగుమ్మ 'మృణాల్ ఠాకూర్'. అప్పటివరకు పలు సీరియల్స్ లో నటించడంతోపాటు కొన్ని సినిమాలు కూడా చేసిందికానీ వాటితో రాని క్రేజ్ సీతారామంతో వచ్చింది. రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయ్యారు. తెలుగులో నాని సరసన హాయ్ నాన్న సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తున్న మృణాల్ చేతిలో నాలుగు నుంచి ఐదు సినిమాలున్నాయి.
చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ ఠాకూర్‌కు మరో బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జోడీగా మృణాళ్ నటించబోతోందని సమాచారం. రెబల్ స్టార్ ప్రభాస్ తో సీతారామం దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ పీరియాడికల్ డ్రామా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్‌ను ఎంపిక చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కల్కి 2898 ఏడీ', మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్-శౌర్యాంగపర్వం' చేయాల్సి ఉంది. ఈ సినిమాల తరువాత హను రాఘవపూడి చిత్రం చేస్తాడా? లేదంటే వాటితోపాటు సమాంతరంగా తెరకెక్కిస్తారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రం చేయాల్సి ఉంది. ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం మృణాల్ ఫ్యామిలీస్టార్ చిత్రంలో నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సమ్మర్ లో ఈ చిత్రం విడుదల కాబోతోంది.












Click it and Unblock the Notifications