ధనుష్ తో పెళ్లి..? మృణాల్ ఏం చెప్పిందంటే..?
గత కొన్ని నెలలుగా ప్రేమ, పెళ్లి అంశాల్లో మృణాల్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె తమిళ స్టార్ హీరో ధనుష్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరూ ఈ నెలలోనే పెళ్లి చేసుకోనున్నారని కూడా ప్రచారం సాగింది. అది కూడా ఈ ఫిబ్రవరి 14నే అంటూ ఎన్నో ఊహాగానాలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై స్వయంగా మృణాల్ ఠాకూర్ నుంచే క్లారిటీ వచ్చింది. ఈ పెళ్లి రూమర్స్ ఎలా వచ్చాయో కూడా తెలీదని అవన్నీ పచ్చి అబద్దం అని ఆమె కొట్టి పారేసింది. ఈ ఫిబ్రవరి 14న ఎవరైతే తమ పెళ్లి అని అనుకున్నారో.. అది వాళ్లకు వాలెంటైన్స్ డే .. కాదు ఏప్రిల్ 1 లాంటిది అని మృణాల్ పేర్కొంది. అలా నమ్మిన వారు అంతా ఫూల్స్ అవుతారు అంటూ అసలు విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది. హీరో ధనుష్ తనకు మంచి ఫ్రెండ్ అని ఆ ప్రచారాన్ని మృణాల్ ఖండించింది.
ఇక అంతకుముందు టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తోనూ మృణాల్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ప్రచారానని కూడా ఆమె ఖండించింది. ఇలాంటి రూమర్స్ వినడానికి ఫన్నీగా ఉంటాయని, కొంతమంది వార్తలు సృష్టిస్తుంటారని తెలిపింది. వాటిని చూసి నవ్వుకుంటానని మృణాల్ పేర్కొంది. అయితే ఇలాంటివి తనకు ఫ్రీ PR స్టంట్స్ స్పష్టం చేసింది.

మృణాల్ ఠాకూర్ తాజా సినిమా 'దో దీవానే శహర్ మే' ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజ్ కానుంది. రవి ఉద్యవర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మృణాల్ తోపాటు ఇందులో సిద్ధాంత్ చతుర్వేది కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే రిలీజైన పాటలకు, టీజర్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అలాగే తెలుగులోనూ అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న 'డకాయిట్ ఓ ప్రేమ కథ' సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా దాదాపు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications