'తండేల్' రివ్యూ :బొమ్మ దద్దరిల్లింది..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన చిత్రం 'తండేల్'. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో సగటు ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి ఏర్పడింది. కొంతకాలంగా వరుస ఫ్లాప్‌లోతో ఇబ్బంది పడుతున్న నాగ చైతన్యకు ఈ సినిమా హిట్ ఇచ్చిందో లేదో ఈ సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కథ
ఉత్తరాంధ్రకు చెందిన జాలరి చూట్టు తిరిగే కథే 'తండేల్'.చేపల వేటకు వెళ్లిన హీరోని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలుపాలైన ప్రియుడి రాక కోసం ప్రేయసి ఎదురు చూసిన ప్రేయసి ఎంతటి వేదన అనుభవిస్తుందనేది తండేల్ సినిమా. యధార్థ సంఘటనలకు ,కొంత కాల్పనికత జోడించి తండేల్ తెరకెక్కించారు. ఘాడంగా ప్రేమించుకున్న ఓ జంట అనూహ్యం ఎడబాటుకు గురి అవుతుంది. ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారనేది మిగిలిన కథ.

naga chaitanya thandel movie review and rating

విశ్లేషణ
ఇలాంటి కథతో తెలుగులో చాలానే సినిమాలు తెరకెక్కాయి. అయితే కథలో వైవిధ్యాన్ని చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొదటి భాగంలో నాగ చైతన్య , సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. చేపల వేటకు వెళ్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. ట్విస్ట్‌తో ఇంటర్వెల్‌ను ముగించిన దర్శకుడు, సెంకడాఫ్‌లో మెయిన్ పాయింట్‌లోకి వెళ్తాడు. అయితే ఈ సమయంలో దర్శకుడు కాస్తా తడబడినట్టు అనిపించింది. అయితే తిరిగి పుంజుకుని చివరి 20 నిమిషాలను అద్భుతంగా ముందుకు నడిపించాడు.

నటీనటుల ఫర్మెమెన్స్
నాగ చైతన్యను ఇప్పటి వరకు లవర్ బాయ్‌గానే చూసిన అభిమానులకు, తనలోని మరో యాంగిల్‌ను ఆయన పరిచియం చేశారు. చేపల వేటకు వెళ్లే యువకుడిగా, ప్రేమికుడిగా, జాలరి గ్యాంగ్‌కు లీడర్‌గా, పాకిస్థాన్‌లో దొరికిపోయిన జాలరిగా ఇలా విభిన్న పాత్రల్లో నాగ చైతన్య మెప్పించారు. ముఖ్యంగా పాకిస్థాన్‌లో ప్రేమికురాలి కోసం బాధపడే సీన్లలో నాగ చైతన్య అద్భుతంగా నటించారు. కొన్ని సీన్లలో నాగ చైతన్య యాక్టింగ్‌కు కంటతడి రావడం పక్కా. ఇక బుజ్జితల్లిగా సాయి పల్లవి నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. పాకిస్థాన్‌లో దొరికిపోయిన
తన ప్రియుడు కోసం ఎదురు చూసే పాత్రలో సాయి పల్లవి చక్కగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేర నటించారు.

naga chaitanya thandel movie review and rating

టెక్నికల్
తండేల్ మూవీకి దేవిశ్రీ సాంగ్స్ బ్యాక్ బోన్‌గా నిలిచారు.ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ అన్నమాట వినిపిస్తుంది.చందు మొండేటి మరోసారి తన దర్శకత్వంతో తెర మీద మ్యాజిక్ చేశారనే చెప్పాలి. కార్తికేయ-2 తర్వాత అతను దర్శకత్వం వహించిన సినిమా ఇదే. అయితే మొదటి భాగాన్ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు, సెంకడాఫ్‌‌కు వచ్చే సరికి కథను సరిగా ముందుకు తీసుకువెళ్లడంలో కాస్తా తడపడ్డారు. అయినప్పటికీ చివరి 20 నిమిషాల సినిమాను అద్భుతంగా మళ్లించడంలో అతను సక్సెస్ అయ్యాడు. నిర్మాణ విలువులు బాగున్నాయి. కెమెరా పనితనం బాగుంది.

ఫైనల్‌గా
నాగ చైతన్యకు రాజులమ్మ జాతరే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+