నాగార్జున ఇంట్లో పంచాయితీ.. వెనక్కి తగ్గని నాగచైతన్య?
అక్కినేని నాగార్జున పెద్ద తనయుడు నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి ఏడోతేదీన విడుదల కాబోతోంది. చందు మొండేటి దర్శకుడు. ఆగస్టు ఎనిమిదోతేదీన శోభిత ధూళిపాళతో నాగచైతన్యకు నిశ్చితార్థం జరిగింది. అంతకుముందు రహస్యంగా ప్రేమను కొనసాగించిన ఈ జంట వివాహంతో ఒకటి కాబోతున్నారు. ఇటీవలే పసుపు దంచే కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను కూడా శోభిత షేర్ చేసింది. శోభితకు ముందు నాగచైతన్య సమంతను ప్రేమించి వివాహం చేసుకొని విడాకులిచ్చిన సంగతి తెలిసిందే.
సినిమాను వాయిదా వేసుకోవాలని కోరగా
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో కుబేర చిత్రం చేస్తున్నారు. దీనికి శేఖర్ కమ్ముల దర్శకుడు. ధనుష్, రష్మిక ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. అదే నెలలో తండేల్ చిత్రం విడుదల కానుండటంతో సినిమాను వాయిదా వేసుకోవాలని నాగార్జున నాగచైతన్యను కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే డిసెంబరులోనే విడుదల కావాల్సిన సినిమా సంక్రాంతికి, తర్వాత ఫిబ్రవరి ఏడోతేదీకి ఫైనలైందని, అంతకుమించి తమదగ్గర వేరే అవకాశం లేదని, అదే తేదీన విడుదల చేయడం ఖరారైందని నాగచైతన్య స్పష్టం చేశారు. అయితే తన సినిమాకు ఇది పోటీగా ఉండే అవకాశం ఉందని రిక్వెస్ట్ చేసినప్పటికీ నాగచైతన్య వెనక్కి తగ్గలేదు.

స్వల్ప వాగ్వాదం నడిచింది
ఈ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. నాగార్జునకు కోపం రావడంతో గొడవ జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదలకు సంబంధించి తండ్రీ కొడుకులు గొడవ పడటం ఏమిటని, ఇదంతా పుకారని, దీన్ని నమ్మొద్దంటూ అక్కినేని అభిమానులు అంటున్నారు. తండేల్ సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నారు. అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. నాగచైతన్యకు రూ.100 కోట్ల కలెక్షన్లతో ఈ సినిమాను బహుమతిగా ఇస్తానని అల్లు అరవింద్ ప్రకటించారు. దీంతో ఈ సినిమాపై ఆయన ఆత్మవిశ్వాసంతో ఉన్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications