బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకకు ఆ ఇద్దరినీ పిలవలేదు?
నందమూరి నటసింహం బాలకృష్ణ తాతమ్మ కల సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈనెల 30వ తేదీతో 50 సంవత్సరాలు పూర్తిచేసుకోబోతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు సినీ పరిశ్రమ తరఫున ప్రముఖులంతా బాలయ్యకు గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుతున్నారు. సెప్టెంబరు ఒకటోతేదీ సాయంత్రం ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ సందర్భంగా వేడుకలకు హాజరుకావాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డితోపాటు చిరంజీవి, పవన్ కల్యాణ్, అమితాబ్ బచ్చన్ లాంటి వారందరికీ ఆహ్వానం అందింది.
చంద్రబాబు అరెస్ట్ పై మౌనం
మెగా కుటుంబంలోని సభ్యులు, అల్లు అరవింద్, అల్లు అర్జున్.. ఇలా ప్రముఖులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. అయితే వేడుకలకు ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులను మాత్రం ఆహ్వానించలేదని వార్తలు వస్తున్నాయి. వారెవరో కాదు.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్. మొదట్లో తెలుగుదేశం పార్టీతోపాటు బాలకృష్ణ, ఇతర నందమూరి కుటుంబ సభ్యులందరికీ తారక్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. 2009 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత క్రమేణా పార్టీకి దూరం జరిగారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో కూడా తారక్ స్పందించలేదు. మౌనంగా ఉన్నారు.

నియంత్రించే బాధ్యత తీసుకోలేదు
ఆయన అనుచరులైన కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై, చంద్రబాబు, లోకేష్, బాలయ్యపై అవాకులు, చవాకులు పేలారు. వారిని నియంత్రించాల్సిన బాధ్యత తారక్ పై ఉన్నప్పటికీ ఆయన అటువంటి ప్రయత్నం చేయలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ అంటేనే మండిపడుతున్నారు. కల్యాణ్ రామ్ కు ఉన్న ఆర్థిక సమస్యలన్నింటినీ తారక్ తీర్చేయడంతో ఎన్టీఆర్ మాటను కల్యాణ్ రామ్ జవదాటడంలేదు.అందరికీ ఆహ్వానం అందిస్తున్నారు కాబట్టి వీరిద్దరికి కూడా ఆహ్వానం అందుతుందా? అందితే వస్తారా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇప్పటివరకైతే వీరిద్దరికీ ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications