చిలకలూరిపేటలో 'డాకూ మహారాజ్' తో బాలయ్య సంచలన రికార్డ్
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ సీనియర్ హీరోల్లో అందరికన్నా ముందుస్థానంలో నిలిచారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూమహారాజ్ తర్వాత తాజాగా అఖండ2 చేస్తున్నారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకూ మహారాజ్ చిత్రానికి బాబీ దర్శకుడు. ఈ సినిమా దాదాపు రూ.186 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. రూ.200 కోట్ల పైనే వసూలు చేస్తుందనుకున్నప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా పోటీగా బాగా ఆడటంతో కుటుంబ ప్రేక్షకులు ఆ సినిమాకు మొగ్గు చూపారు. దీంతో డాకూ మహారాజ్ రూ.186 దగ్గర ఆగిపోయింది.
ఎలివేషన్లు ఒక రేంజ్ లో ఉంటాయి
ఓటీటీలో కొన్నాళ్లు టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇతర దేశాల్లో కూడా ఈ సినిమాను బాగా చూశారు. శాటిలైట్ ఛానల్ లో వేసినప్పుడు కూడా మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బాలయ్య ఎలివేషన్లు ఒక రేంజ్ లో ఉంటాయి. ఒకప్పుడు సినిమాలు శతదినోత్సవాలు జరుపుకునేవికానీ ఇప్పుడు అన్నీ రెండు మూడు వారాలకే థియేటర్ల నుంచి మాయమవుతున్నాయి. కానీ బాలయ్య సినిమాలు మాత్రం ఏదో ఒక థియేటర్ లో విడుదలైన ప్రతి సినిమా కచ్చితంగా శతదినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇప్పటికే తెలుగులో అత్యధిక రోజులు ఆడిన సినిమాగా రికార్డు లెజెండ్ బాలయ్య పేరుమీదే ఉంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ కూడా శతదితనోత్సవాన్ని జరుపుకున్నాయి.

చిలకలూరిపేట వెంకటేశ్వరలో 200 రోజులు
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఉన్న వెంకటేశ్వర థియేటర్ లో డాకూ మహారాజ్ తాజాగా 200 రోజులను పూర్తిచేసుకుంది. రోజుకు 4 షోలతో 200 రోజులు ఆడటం విశేషం. వరుసగా బాలయ్య సినిమాలు 175 రోజులు ఆడటం విశేషం. అఖండ నుంచి డాకూ మహారాజ్ వరకు సిల్వర్ జూబ్లీ చేసుకున్నాయి. ఒకరకంగా 200 రోజులు ఆడటం అనేది బాలయ్య మరో రికార్డు సాధించారని చెప్పొచ్చు. త్వరలోనే అఖండ2తో మరో సిల్వర్ జూబ్లీని సొంతం చేసుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 25వ తేదీన విడుదల కాబోతోంది.












Click it and Unblock the Notifications