చిరంజీవి సినిమాకు చీఫ్‌ గెస్ట్‌గా బాలకృష్ణ

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకులుగా రాణిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ. గతంలో వీరిద్దరితో మల్టీస్టారర్ సినిమా చేయాలని చాలామంది నిర్మాతలు, దర్శకులు ప్రయత్నించారుకానీ సరైన కథలు దొరక్క ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. వీరిద్దరూ వ్యక్తిగతంగా మంచి స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నప్పటికీ అభిమానులు మాత్రం రెండుగా విడిపోయి వాదులాడుకుంటారు. అభిమాలను మధ్య యుద్ధం ఎంత దూరం వెళ్లిందంటే చివరకు చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఉన్న సఖ్యతను కూడా చెడగొట్టేంత వెళ్లింది.

అతిథిగా వెళ్లారు
తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల సందర్భంగా వీరు ఓ పాట కోసం కలిసి నటించారు. వెండితెరపై మాత్రం కలవలేదు. అయితే చిరంజీవి కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన ఘరానా మొగుడు సినిమాకు ముఖ్యఅతిథిగా బాలకృష్ణ వెళ్లారు. దేవీ ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై దేవీవరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి చిరంజీవి కోటిరూపాయల పారితోషికం తీసుకొని చరిత్ర సృష్టించారు. ఈ సినిమా ముహూర్తపు షాట్ కు బాలకృష్ణను ప్రత్యేక అతిథిగా నిర్మాత, దర్శకుడు తీసుకువచ్చారు.

nandamuri balakrishna is the chief guest of Chiranjeevi movie

మంచంమీద కూర్చొని మాట్లాడుకున్నారు
ముహూర్తపు షాట్ కు బాలయ్య క్లాప్ కొట్టి సన్నివేశం పూర్తయిన తర్వాత చిరంజీవి, బాలకృష్ణ కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. ముహూర్తపు సన్నివేశంగా ఇంటర్వెల్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. తర్వాత మంచం అదే మంచం మీద కూర్చొని చాలాసేపు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. దానికి సంబంధించి ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

బాలకృష్ణ వెళ్లి ఎటువంటి అరమరికలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో క్లాప్ కొట్టాడు కాబట్టే అది ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచిందంటూ బాలయ్య అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఇద్దరూ హీరోల మధ్య 40 సంవత్సరాల నుంచి సినిమాల పరంగా పోరు నడుస్తోంది. తాజాగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాతో మరోసారి తలపడ్డారు. రెండూ ఘనవిజయాన్ని సాధించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+