ఆ సినిమా చేయనందుకు ఇప్పటికీ బాధపడుతున్న బాలకృష్ణ

సినీ పరిశ్రమలో తమదగ్గరకు వచ్చిన కథలను హీరోలు కొన్ని కొన్ని సందర్భాల్లో తిరస్కరిస్తుంటారు. కాల్షీట్లు ఖాళీ లేకపోవడం, కథ నచ్చినా మరికొన్ని విషయాలు నచ్చకపోవడం, ఇతరత్రా కారణాలతో కొన్నింటిని దూరం చేసుకుంటారు. అలా వదులుకున్న సినిమాలు కొన్నిసార్లు బ్లాక్ బస్టర్ హిట్టవుతాయి.. మరికొన్నిసార్లు ఫ్లాపవుతాయి. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా కొన్ని కొన్ని సినిమాలను వదులుకున్నారు. అలా వదులుకున్న సినిమాల్లో ఒకదాన్ని మాత్రం చేయలేకపోయినందుకు ఆయన ఇప్పటికీ బాధపడుతుంటారు.

సమరసింహారెడ్డి సినిమా చేస్తున్న సమయంలో రైటర్ చిన్నికృష్ణ నరసింహ సినిమా కథను బాలయ్య దగ్గరకు తీసుకువెళ్లారు. అప్పటికే కొన్ని సినిమాలను ఒప్పుకోవడంతోపాటు బాగా బిజీగా ఉండటంతో ఆ సినిమా చేయడం కుదరలేదు. కానీ కథ మాత్రం బాగా నచ్చింది. తర్వాత తమిళ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దగ్గరకు ఈ కథ వెళ్లగా రజనీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ కాంబినేషన్ లో నరసింహంగా రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రజనీకాంత్, రమ్యకృష్ణ పోటీపడి నటించారు.

nandamuri balakrishna missed narasimha movie

వాస్తవానికి రజనీకాంత్ పాత్ర బాలయ్యకు అద్భుతంగా సెట్టయ్యేదని అందరూ భావించారు. అంతేకాకుండా రమ్యకృష్ణకు పోటీగా ఆమెను ఎదుర్కోవడానికి బాలయ్య తన విశ్వరూపాన్ని చూపించేవాడని అభిమానులు అంటుంటారు. ఈ సినిమాను వదులుకోవడంలో బాలకృష్ణ దురదృష్టవంతుడని చెప్పొచ్చు.

ఒక స్టైలిష్ పాత్రలో అద్భుతంగా నటించడానికి వచ్చిన అవకాశమని, అది చేసుంటే బాగుండేదని ఫ్యాన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు. ఏదేమైనప్పటికీ రజనీకాంత్ ఖాతాల్లో బ్లాక్ బస్టర్ హిట్ పడేలా చేయడంలో మాత్రం బాలయ్య తనవంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమాను చేస్తున్న బాలకృష్ణ దీన్ని ఈ ఏడాది విజయదశమికి విడుదల చేసే యోచనలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+