'వార్ 2' చూడాలని లేదు..చూడొద్దు.. నారా రోహిత్ సంచలన కామెంట్స్..?

గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌, బాలకృష్ణల మధ్య మనస్పర్థలు తలెత్తుతున్నాయని పలు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత , నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒంటరయ్యారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్ట్‌పై నందమూరి కుటుంబం అంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు మాత్రం ఈ ఘటనపై రియాక్ట్ కాలేదు.

అప్పటి నుంచి నారా, నందమూరి కుటుంబం ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను దూరం పెడుతూ వస్తోంది.బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సినీ ,రాజకీయ ప్రముఖులందరూ స్పందించారు. దీనిపై ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు సైతం రియాక్ట్ అయ్యారు.బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు రావడంతో నందమూరి, నారా కుటుంబాలు కలిసి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. కానీ ఈ సెలబ్రేషన్స్‌కు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లకు ఆహ్వానం అందలేదు. తాజాగా జరిగిన ఈ ఘటనతో మరోసారి నందమూరి ఫ్యామిలీలో ఉన్న విభేదాలు బయటపడ్డాయి.

Nara Rohit s Bold Remarks on Coolie and War 2 Spark Social Media Debate

ఎన్టీఆర్ 'వార్ 2' సినిమా సమయంలో .. ఆయన ఇచ్చిన స్పీచ్‌పై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మీరు నా వెంట ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఏం చేయలేరంటూ ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ వివాదాస్పదమైంది. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే ఎన్టీఆర్‌పై అసభ్య పదజాలంతో దూషించడం సంచలనంగా మారింది. ఈ ఘటన మరవక ముందే నారా రోహిత్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' సినిమాపై కామెంట్స్ చేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం తన కొత్త చిత్రం 'సుందరాకాండ' విడుదల కోసం ఎదురుచూస్తున్న నారా రోహిత్ ..ఇటీవల విడుదలైన 'కూలీ', 'వార్ 2' చిత్రాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నారా రోహిత్ మాట్లాడుతూ, 'కూలీ' చిత్రాన్ని చూశానని, అందులోని కొన్ని బ్లాక్స్ (భాగాలు) చాలా బాగున్నాయని చెప్పారు. మొత్తం మీద సినిమా 'ఓకే, పర్లేదు' అనే స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు.

అయితే, ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' చిత్రంపై మాత్రం నారా రోహిత్ స్పందించలేదు. ఆ సినిమాను తాను చూడలేదని, చూడాలనే ఆసక్తి కూడా తనకు లేదని ఆయన తెలిపారు. తన స్నేహితులు ఈ రెండు చిత్రాలలో ఏది చూడాలి అని అడిగితే, 'కూలీ' చిత్రాన్ని చూడమని సలహా ఇచ్చానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. 'వార్ 2'పై నారా రోహిత్‌ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+