జానీ మాస్టర్ నోటి నుంచి మరెన్ని నిజాలు వెలుగులోకి
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిన విషయమే. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆయన దగ్గర పని చూసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించినట్లు వాపోయింది. అదే విధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.
తనపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడని ఎఫ్ఐఆర్ లో యువతి ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ భార్య అయేషా సైతం రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలుగు రోజులు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి పోలీసులు ఆయన్ను నేరుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఉప్పరిపల్లిలోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జానీ మాస్టర్‌కు 14 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

అయితే జానీ మాస్టర్‌ను విచారించేందుకు నార్సింగి పోలీసులు కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే జానీపై పోక్సో కేసు నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టుకు ఈ పిటిషన్‌ను బదిలీ చేశారు. ఇవాళే ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో జానీ మాస్టర్‌ను ప్రశ్నిస్తే.. మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. జానీ మాస్టర్‌ను పోలీసులు పది రోజుల కస్టడీ కోరినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బెయిల్ కోసం జానీ మాస్టర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications