పార్టనర్‌ను పరిచయం చేసిన మెగా డాటర్..వీడియో వైరల్
మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తరువాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ కావడానికి నిహారిక ప్రయత్నిస్తోంది. నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించ లేకపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికే భర్తకు విడాకులిచ్చి షాకిచ్చింది.
విడాకులు అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లో నటిస్తోంది. మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో 'మద్రాస్‌కారన్' మూవీలో హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. తెలుగులో మనోజ్ నటిస్తోన్న ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఆమె తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన ''కమిటీ కుర్రాళ్లు'' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

ఇక నిహారిక నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే.యదు వంశీ దర్శకత్వంలో ''కమిటీ కుర్రాళ్లు'' అనే సినిమాను నిర్మించింది. తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు. తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్‌లో ఉన్నారు.
ప్రస్తుతం తన తర్వాత సినిమాను అనౌన్స్ చేసే పనిలో ఆమె నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే నిహారికకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. నిహారిక జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో హీరోయిన్ వితిక శేరు కూడా కనిపించారు. వీరిద్దరు కలిసి జిమ్‌లో తెగ కష్టపడుతున్నారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు నిహారికకు జిమ్ పార్టనర్ దొరికారంటూ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications