నువ్వే ఓ ఫ్లాప్ హీరో.. నీకు ఆ ఫ్లాప్ దర్శకుడు అవసరమా..?

సినిమా ఇండస్ట్రీలో హిట్‌కు ఉండే ప్రాధాన్యత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హిట్ ఉంటేనే గౌరవం దక్కుతుంది ఇక్కడ. వరుస హిట్లు కొట్టిన హీరో అయిన సరే ఓ ఫ్లాప్ పడితే.. దర్శక, నిర్మాతలు అతనితో సినిమా చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వ సాధారణం. ఏ హీరో అయిన ఓ ఫ్లాప్ పడితే, తన తర్వాత సినిమాను మంచి దర్శకుడితో,హిట్ కొట్టి దర్శకుడితో పని చేయాలని చూస్తారు. కానీ ఓ హీరో వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్నాడు. తన కెరీర్‌లోనే దారుణ డిజాస్టర్‌లను ఫేస్ చేశాడు. అలాంటి హీరో ఇప్పుడు ఫ్లాప్ దర్శకుడితో పని చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు నితిన్.

కెరీర్ స్టార్టింగ్‌లో నితిన్ వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జయం, దిల్ వంటి హిట్లతో అప్పుడున్న హీరోలకు గట్టి పోటీనిచ్చారు. అయితే ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు నితిన్. పదేళ్ల తర్వాత ఇష్క్ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. టాప్ దర్శకులతో సినిమాలు చేసినప్పటికి సక్సెస్ కాలేకపోయిన హీరో ఎవరైనా ఉన్నారంటే అతి కచ్చితంగా నితిన్. కెరీర్ ప్రారంభం నుంచి టాప్ దర్శకులతో సినిమాలు చేశారాయన. తన మొదటి సినిమా జయం. ఆ సినిమాకు దర్శకుడు తేజ. అప్పట్లో ఆయన టాప్ దర్శకుడే.

Nithiin s Career at a Crossroads Why a Film with Srinu Vaitla Could be a Risky Move

ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో అల్లరి బుల్లోడు, ఎన్టీఆర్‌కు ఆది వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడుతో నితిన్ దిల్ సినిమా చేశాడు. దర్శకధీరుడు రాజమౌళితో సై, కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీ ఆంజనేయం, పూరీ జగన్నాధ్‌తో హార్ట్ ఎటాక్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో అఆ. ఇలా తెలుగు ఇండస్ట్రీలో టాప్ దర్శకులతో సినిమాలు చేసినప్పటికి నితిన్ కెరీర్ ముందుకు సాగడం లేదు.నితిన్ కెరీర్ ఒడిదుడుకుల్లో ఉందనే చెప్పాలి. ఒక హిట్ పడితే నాలుగు ఫ్లాపులు అన్నట్టుగా సాగుతోంది నితిన్ కెరీర్.

జయం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నితిన్ తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే దిల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆ తరువాత నుంచి నితిన్ కెరీర్ గాడి తప్పింది. నాలుగు సినిమాలకు ఓ హిట్టు అన్న చందంగా మారింది. భీష్మ తర్వాత నితిన్ నటించిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. నితిన్
చివరి రెండు సినిమాలు ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్,రాబిన్ హుడ్, తమ్ముడు ఎప్పుడు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి.తమ్ముడు సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకంటే అంత మంచిది. ఈ సినిమా కనీసం థియేటర్ ఖర్చులను కూడా రాబట్టలేకపోయింది. బలగం వేణు ఎల్లమ్మ కథను నితిన్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. అయితే నితిన్‌కు వరుస ఫ్లాపులు రావడంతో తమిళ హీరోతో ఎల్లమ్మను తెరకెక్కించడానికి వేణు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

దీంతో 'ఎల్లమ్మ' నితిన్ చేజారిపోయినట్టే కనిపిస్తోంది. ఈ సమయంలోనే నితిన్ ఫ్లాప్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్లతో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సీగ్నల్ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. ఇప్నటికే శ్రీను వైట్ల outdated జాబితాలో చేరిపోయాడు. ఇప్పుడు అతనితో నితిన్ సినిమా చేయడం వల్ల అతని కెరీర్ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. మరి శ్రీను వైట్లతో సినిమా చేయడంపై నితిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+