గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా..?
మలయాళీ బ్యూటీ "నివేదా థామస్" తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. మలయాళీ అయినా తెలుగులోనే ఎక్కువగా క్రేజ్ సొంతం చేసుకుంది. బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ.. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి వెండితెరపై సందడి చేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో హీరోయిన్ గా పలు సక్సెస్ ఫుల్ చిత్రాలతో కొనసాగుతోంది.
సినీ కెరీర్..
1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించింది నివేదా. 2002లో మలయాళంలో ఉత్తర అనే సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బుల్లితెరపై మై డియర్ భూతం అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. 2016లో నాని నటించిన 'జెంటిల్మెన్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా, దర్బార్, వకీల్ సాబ్, మీట్ క్యూట్, శాకిని డాకిని, 35 చిత్రాలతో తెలుగు ఆడియెన్స కు బాగా చేరువైంది.

అయితే తొలిసారిగా అమ్మ పాత్రలో కనిపించి అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచింది. ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన "35" చిన్న కథ కాదు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇన్నాళ్లు గ్లామర్ హీరోయిన్ గా కనిపించిన నివేదా.. తల్లి పాత్రలో నటించి మార్కులు కొట్టేసింది. ఇందులో తన పాత్రకు గానూ ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది.
రీసెంట్ గా జరిగిన ఈ అవార్డ్ వేడుకలలో నివేదా లుక్ చూసి ఆశ్చర్యపోయారు నెటిజన్స్. చూడటానికి బొద్దుగా ఉండటంతో అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు. అప్పట్లో బరువు తగ్గినట్లు వార్తలు వచ్చిన ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియో లో ఆమె బొద్దుగా కనిపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ లుక్ లో ఆమె ముద్దుగా కనిపిస్తోందంటూ స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications