ఎన్టీఆర్ మిస్ అయ్యాడు..అల్లు అర్జున్ బలయ్యాడు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది. ఈక్రమంలో ఓ మహిళ మరణించారు. ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

వైద్య పరీక్షలు అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టులో హాజరపరిచారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ తరుఫు న్యాయవాదులు హైకోర్టు తలుపులు తట్టారు. ఎట్టకేలకు హైకోర్టు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల మధ్యంతర బెయిల్‌తో పాటు, రూ.50 వేల పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద అల్లు అర్జున్‌ను విడుదల చేయడం జరిగింది. అల్లు అర్జున్ విడుదల కావడంతో యావత్తు తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా అల్లు అర్జున్ ఇంటికి తరలివెళ్లి ఆయన్ను పరామర్శించడం జరిగింది.

NTR escaped from the incident like Allu Arjun

అయితే ఈ విషయంలో మరో వాదన తెర మీదకు వస్తోంది. ఈ విషయంలో ఎన్టీఆర్ జస్ట్ మిస్ అయ్యారనే చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ నటించిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు సైతం భారీగా అభిమానులు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఈ ఈవెంట్ నిర్వహించడానికి నిర్వాహకులు ప్లాన్ చేశారు. అయితే జారీ చేసిన పాస్‌ల కన్నా అభిమానులు ఎక్కువ రావడం జరిగింది. పోలీసులు సైతం అభిమానులను అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది.

పరిస్థితులు అదుపు తప్పడంతో ఎన్టీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేశారు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోవాటెల్‌లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఒకవేళ ఏం కాదులే అని ఎన్టీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. పొరపాటున ఏదైనా జరిగి ఉంటే ఈ రోజున అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ఉండాల్సి వచ్చేదని వారు చెబుతున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ మిస్ అయితే అల్లు అర్జున్ మాత్రం బలయ్యారనే చర్చ సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+