ఎన్టీఆర్‌కు పెను ప్రమాదం..తీవ్ర గాయాలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టు, వేళ్లకు గాయాలు అయినట్లు తెలుస్తోంది.తీవ్రంగా గాయపడిన ఎన్టీఆర్‌ను చిత్ర యూనిట్ హుటహుటిన ఆస్పత్రికి తరలించారు. మొదట ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదానికి గురయ్యారంటూ ప్రచారం జరిగింది. తాాజాగా తన గాయంపై ఎన్టీఆర్ స్పందించారు. యాక్సిడెంట్ అంటూ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. జిమ్‌లో జారి పడిపోవడం వల్ల చేతికి చిన్న గాయం అయిందని ఎన్టీఆర్ తెలిపారు.
ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని, రెండు వారాల తర్వాత తిరిగి సినిమా షూటింగ్‌లో పాల్గొంటానని ఎన్టీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాను పూర్తి చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. దేవర మొదటి పార్ట్ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమాలోని రెండు పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే దేవర సినిమా షూటింగ్ సమయంలో ఇది రెండో ప్రమాదం.

గతంలో మోదకొండమ్మ పాదల వద్ద షూటింగ్ జరుగుతుండగా.. ఒక్కసారిగా యూనిట్ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆచార్య తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర షూటింగ్ పూర్తి అయిందని మంగళవారమే ఎన్టీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫొటోను తన సోషల్ మీడియాలో ఎన్టీఆర్ షేర్ చేశారు.
దేవర తర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టారు. ఎన్టీఆర్‌కు గాయాలు కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications