‘ఓర్మాక్స్’ ఇండియా టాప్-10 హీరోస్: హవా చాటిన టాలీవుడ్
ఓర్మాక్స్ మీడియా విడుదల చేసిన సెప్టెంబర్ నెల మోస్ట్ పాపులర్ ఇండియన్ హీరోల జాబితా సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈసారి టాప్ టెన్ లిస్ట్‌లో కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకోగా, మన టాలీవుడ్ స్టార్స్ మరోసారి తమ సత్తా చాటారు. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ తన సింహాసనాన్ని మరింత పదిలం చేసుకుని తిరుగులేని టాప్ స్టార్‌గా నిలిచారు.
ప్రభాస్ అగ్రస్థానం
ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోగా ప్రభాస్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన స్థానాన్ని టచ్ చేసే సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక స్థానం మెరుగుపరుచుకుని మూడో స్థానానికి ఎగబాకారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ 'రాకా'తో ఆయన మరింత జోరుమీదున్నారు. ఇక బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ రెండో స్థానంలో ఉండగా, రాజకీయాల్లో బిజీగా ఉన్న తమిళ నటుడు విజయ్ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు.

మహేష్, చరణ్ స్థానాలివే
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి' షూటింగ్‌తో బిజీగా ఉన్న మహేష్ బాబు ఐదో స్థానంలో స్థిరంగా కొనసాగుతున్నారు. 'టాక్సిక్' తర్వాత బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణం'లో రావణుడిగా నటిస్తున్న యశ్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కొత్త సినిమాల ప్రకటనలు లేకపోయినా, ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా రామ్ చరణ్ తొమ్మిదో స్థానంలో సేఫ్‌గా నిలిచారు.
ఇక సల్మాన్ ఖాన్ ఏడో స్థానంలో, సూర్య ఎనిమిదో స్థానంలో, రణ్‌వీర్ సింగ్ పదో స్థానంలో నిలిచారు. అయితే గత జాబితాలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈసారి అనూహ్యంగా టాప్ టెన్ రేసు నుంచి తప్పుకోవడం ఆయన అభిమానులను నిరాశపరిచింది. మొత్తానికి ఈ సెప్టెంబర్ ఓర్మాక్స్ లిస్ట్ మన టాలీవుడ్ హీరోల గ్లామర్, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది.














Click it and Unblock the Notifications
