మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కెరీర్‌లో మరో గోల్డెన్ ఫేజ్‌ను ఆస్వాదిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకొని.. గ్రాండ్ హిట్ కొట్టింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను సమానంగా ఆకట్టుకుని, చిరంజీవి కెరీర్‌లోనే తొలిసారి రూ.300 కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకుంది. "వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్" అంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఈ భారీ విజయంతో చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తన 158వ చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ సినిమా అనౌన్స్ కాగా, వీరి కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఏర్పడింది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి, తీవ్ర యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కనిపించడం ద్వారా ఇది పూర్తి స్థాయి మాస్ యాక్షన్ డ్రామా అని క్లారిటీ వచ్చింది.

కాగా ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా, హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవిపై క్లాప్ కొట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రాన్ని KVN Productions భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మొదటి షెడ్యూల్‌లో చిరంజీవిపై సోలో ఎంట్రీ సీన్స్‌ను చిత్రీకరించడంతో పాటు.. వెంటనే ఒక మాస్ సాంగ్‌ను షూట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారని సమాచారం. యాక్షన్‌కు తగ్గట్టు పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మాస్ సాంగ్స్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇక కథ పరంగా చూస్తే, ఈ సినిమా తండ్రి-కూతురు అనుబంధాన్ని ప్రధానంగా తీసుకుని తెరకెక్కుతోందని తెలుస్తోంది. చిరంజీవిని కొత్త షేడ్‌లో చూపించేందుకు బాబీ బలమైన ఎమోషన్, యాక్షన్, సెంటిమెంట్ కలగలిపిన కథను సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా "కూతురు సెంటిమెంట్" ఈ కథలో కీలక పాత్ర పోషిస్తుందని, ఇది చిరంజీవి ఇమేజ్‌కు కొత్త డైమెన్షన్ తీసుకురానుందని అంటున్నారు.
ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే, బాలీవుడ్ స్టార్ ఐశ్వర్య రాయ్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి చిరంజీవి కుమార్తె పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రియమణి, అనురాగ్ కశ్యప్, బండ్ల గణేష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మొత్తానికి, 'మన శంకర వరప్రసాద్ గారు' విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న చిరంజీవి, మరోసారి బాబీతో కలిసి గతంలో 'వాల్తేరు వీరయ్య'తో వచ్చిన మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేస్తారా? సంక్రాంతి బరిలో చిరు మళ్లీ విజేతగా నిలుస్తారా? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !!












Click it and Unblock the Notifications