ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకున్న పవన్‌కల్యాణ్..!!

ప్రస్తుతం ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ తన సినిమా కెరీర్ లో సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు, అంతేస్థాయిలో ఫ్లాపులు కూడా ఇచ్చారు. సహజంగా హీరోల దగ్గరకు చాలా కథలు తీసుకువస్తారు దర్శకులు, కథారచయితలు. అయితే వారికి నచ్చకో, కాల్షీట్లు ఖాళీ లేకో, లేదంటే మరే ఇతర కారణాలవల్లో ఆ కథ బాగున్నప్పటికీ సినిమా చేసే అవకాశాన్ని వదిలేస్తారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ ను మిస్ చేసుకున్నారు. ఆ సినిమా ఏదంటే నువ్వే కావాలి.

నిరమ్ సినిమా ఆధారంగా..
తరుణ్, రిచా జంటగా వచ్చిన ఈ సినిమా ఉమ్మడ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసింది. పాటలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. విజయభాస్కర్ దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందించారు. 1999లో విడుదలైన మళయాళ చిత్రం నిరమ్ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. సంగీత దర్శకుడు కోటి అద్భుతమై పాటలను అందించారు. అతి తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు రెండువారాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా లెక్కలేనన్ని థియేటర్లు అవసరమయ్యాయి.

Pawan-Kalyan-missed-out-an-industry-hit-movie-nuvve-kavali

పవన్ - అమీషా పటేల్ జంటగా..
పవన్ కల్యాణ్ కూడ మంచి హీరోగా ఎదుగుతున్న సమయంలో ఈ అవకాశం వచ్చింది. ముందుగా పవన్, అమీషా పటేల్ జంటగా నువ్వేకావాలి సినిమాను మొదలుపెట్టారు. అయితే అనుకోని కారణాలతో షూటింగ్ ఆగిపోయింది. తర్వాత అదే కథతో తరుణ్-రిచా జంటగా రూపొందించారు. యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పాటలు ఇప్పటికీ యూట్యూబ్ లో మార్మోగుతూనే ఉంటాయి.

ఇంత మంచి సినిమాను పవన్ కల్యాణ్ మధ్యలోనే ఎందుకు వదిలేశారనేది ఎవరికీ అర్థం కాలేదు. ఒకరకంగా పవన్ - అమీషా పటేల్ కన్నా తరుణ్ - రిచా జంటే ఎక్కువగా ఆకట్టుకుంది. వారిద్దరైతే ప్రేక్షకులు ఎలా స్వీకరించేవారో అని కొందరు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. ఈ సినిమాతోనే తరుణ్ స్టార్ హీరో అయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+