ఆల్ టైమ్ రికార్డ్ కొట్టిన పవన్ కళ్యాణ్ "ఓజీ"..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ "ఓజీ (OG)". ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలోనూ ఈ మూవీ విషయం హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
ఈ చిత్రంలో పవన్ సరసన కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే నారా రోహిత్ కు కాబోయే భార్య సిరి లేళ్ల, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది.

ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఇక ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఒక బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఘనంగా నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. సెప్టెంబర్ 18 లేదా 19వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఆల్ టైమ్ రికార్డ్..
ఈ చిత్రం అమెరికాలో సంచలనాలు నమోదు చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో మూవీ అత్యంత వేగంగా ఐదు లక్షల డాలర్ల ( (సుమారు రూ. 4.15 కోట్లు) )కు పైగా ప్రీమియర్స్ ప్రీ సేల్స్ జరిగినట్లు మేకర్స్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. "క్షణక్షణమొక తల తెగి పడెలే" అంటూ టైటిల్ సాంగ్‌లోని లిరిక్‌ను షేర్ రాసుకొచ్చారు. కాగా సెప్టెంబర్ 24న అమెరికాలో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.
Kshanakshanamoka thala thegi padele…..#OG #TheyCallHimOG pic.twitter.com/EKKK1Q4YyV
— DVV Entertainment (@DVVMovies) August 30, 2025
ఐటం సాంగ్..
మరోవైపు ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్స్ మెయిన్ లీడ్ గా సినిమాలు చేస్తూనే ఛాన్స్ దొరికితే స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొడుతున్నారు. సమంత, తమన్నా, శ్రీలీల ఇలా చాలా మంది హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టారు. ఇప్పుడు యంగ్ బ్యూటీ నేహా శెట్టి ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. డిజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు.. ఈ స్పెషల్ సాంగ్ ఎంతవరకు కలిసిస్తుందో చూడాలి.
-
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి? -
అనుష్క పెళ్లి ట్విస్ట్: ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు -
తెలంగాణ గద్దర్ అవార్డుకు ఎంపికైన తొలి బయోపిక్ ఇదే.. స్పెషాలిటీ అదే !! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications